తాతైనా కూడా ఆ కోరిక చావట్లేగా..!

230

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Mohan Babu wants To Look Younger In The Movie
మంచు మోహన్‌బాబు తనయులు విష్ణు మరియు మనోజ్‌ హీరోలుగా రాణిస్తున్నారు. మరో వైపు ఆయన కూతురు మంచు లక్ష్మి నటిగా, నిర్మాతగా తనదైన శైలిలో దూసుకు పోతుంది. ఈ సమయంలో మంచు మోహన్‌బాబు వయస్సుకు తగ్గ పాత్రలు చేసుకుంటూ వెళ్లాలి. ఆయన స్థాయి పాత్రలను ఎంచుకుని నటించాలి. కాని మోహన్‌బాబు మాత్రం వయస్సుకు తగ్గ పాత్రలు కాకుండా ఇప్పటికి కూడా యంగ్‌ పాత్రలు చేయాలని ఆరాట పడుతూ ఉంటాడు. తాజాగా ఈయన ఒక సినిమాలో హీరోగా నటించేందుకు కమిట్‌ అయ్యాడు.

‘పెళ్లైనకొత్తలో’ సినిమాతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న మదన్‌ తాజాగా మోహన్‌బాబుతో ఒక సినిమాను చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ పొందాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది. త్వరలోనే సినిమాను సెట్స్‌ పైకి తీసుకు వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది. మోహన్‌బాబు ఈ సినిమాలో కాస్త విభిన్నంగా కనిపిస్తాడని దర్శకుడు చెబుతున్నాడు. చాలా రోజుల తర్వాత మోహన్‌బాబు మళ్లీ హీరోగా నటించనున్న నేపథ్యంలో ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొందరు మాత్రం తాతైనా కూడా మోహన్‌బాబు ఇంకా హీరోగా అంటే ఎలా అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here