20ఏళ్ల తర్వాత “ఇద్దరు” వస్తున్నారట

Posted March 30, 2017

mohan lal and prakash raj act in malayalam odiyan movie1997లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఇద్దరు సినిమా గుర్తింది కదూ. కోలీవుడ్ లో ఇరువర్ అనే పేరుతో తెరకెక్కించిన సినిమాను తెలుగులో ఇద్దరు పేరుతో డబ్బింగ్ చిత్రంగా విడుదల చేశారు. తమిళనాట రాజకీయాలకు, సినిమాకీ మధ్య ఉన్న సంబంధాన్ని బేస్ చేసుకుని తీసిన ఈ సినిమాలో  మోహన్ లాల్, ప్రకాష్ రాజ్  ప్రధానపాత్రల్లో నటించారు. అందులో తమ తమ పాత్రల్లో అసమానమైన నటనను ప్రదర్శించి శభాష్ అనిపించుకున్నారు.  ఇప్పుడు ఇదంతా ఎందుకు అని అనుకుంటున్నారు కదూ. అక్కడికే వస్తున్నాం.

దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత మోహన్ లాల్, ప్రకాష్ రాజ్ లు మళ్లీ కలిసి నటించబోతున్నారట. ఒడియన్ అనే పేరుతో తెరకెక్కుతున్న ఓ మలయాళ మూవీలో నటించబోతున్నారని సమాచారం. థ్రిల్లర్‌ మూవీగా రూపొందనున్న ఈ సినిమాలో మోహన్ లాల్ కథానాయకుడిగా, ప్రకాశ్ రాజ్ విలన్‌ గా నటించనున్నారని తెలుస్తోంది. కొత్త దర్శకుడు శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా  మే 25 నుండి సెట్స్‌ పైకి వెళ్లనుంది. మరి ఇద్దరు సినిమాలో కలిసి నటించి అవార్డులు అందుకున్న ఈ ఇద్దరు ఇప్పుడు ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.

SHARE