మన్యం పులి ఇక్కడా సూపర్ హిట్..!

Posted December 14, 2016

Mohan Lal Manyam Puli Collections Tollywoodమలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన పులి మురుగన్ సినిమా తెలుగులో మన్యం పులిగా రిలీజ్ అయ్యింది. వైశాక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మోహన్ లాల్ ఓ కమర్షియల్ హీరోగా అభిమానులను అలరిస్తారు. అయితే తెలుగులో ఈ సినిమాను సరస్వతి ఫిలింస్ అధినేత సింధూరపువ్వు కృష్ణారెడ్డి డబ్ చేసి రిలీజ్ చేశారు. అనువాద హక్కులు ప్రమోషన్స్ కలిపి కోటి దాకా పెట్టిన కృష్ణారెడ్డి సినిమాకు ఇప్పటికే 2.5 కోట్లను అందుకున్నాడట.

తెలుగులో బి,సి సెంటర్స్ లో మన్యం పులి బాగానే ఆడింది. అది కాక ఆ సినిమా రిలీజ్ టైం కు ఏ పెద్ద సినిమా లేదు కాబట్టి లాగించేశారు. మనమంతా, జనతా గ్యారేజ్ సినిమాలతో వచ్చిన క్రేజ్ తో మోహన్ లాల్ ను చూసి ఆడియెన్స్ థియేటర్స్ కు వచ్చారు. అంతేకాదు శాటిలైట్స్ కాకుండానే రెండు కోట్ల దాకా లాభాలు తెచ్చిన ఈ సినిమా తెలుగులో మంచి బిజినెస్ చేసిందని చెప్పాలి. ఈ  సంవత్సరం ఇప్పటికే బిచ్చగాడు డబ్బింగ్ చరిత్రలోనే హయ్యెస్ట్ కలక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేశాడు. కాస్త స్కోప్ ఉంది అనుకున్న ఏ భాష సినిమా అయినా తెలుగులో రిలీజ్ చేయాలని పరభాష దర్శక నిర్మాతలు ఆలోచించేలా సహకరించింది మన్యం పులి సినిమా కూడా. ఇక నుండి మలయాళంతో పాటుగా ఒకేసారి తన సినిమాలన్నీ తెలుగులో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు మోహన్ లాల్.

SHARE