‘ఓప్పం’ రిమేక్.. ఏయే బాషలో ఎవరు నటిస్తున్నారో తెలుసా ?

Posted October 5, 2016

  mohan lal oppam movie remake heros nagarjuna kamal hassan akshay kumar

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన చిత్రం ‘ఒప్పం’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. అంధుడైన ఓ లిఫ్ట్ ఆపరేటర్, ఓ హత్యకేసు నిందితుణ్ని ఎలా పట్టుకున్నాడు అన్నదే ‘ఒప్పం’ కథ. మాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకొంది.

కేరళలో సంచలనం సృష్టిస్తోన్న ‘ఓప్పం’ వేగంగా 10..20.. 30కోట్ల రూఫాయలని వసూలు చేసింది. అతివేగంగా రూ.30కోట్లు కొల్లగొట్టిన చిత్రంగా ‘ఓప్పం’
రికార్డు సృష్టించింది. ఇప్పుడీ చిత్రాన్ని పలు బాషల్లో రిమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ‘జనతా గ్యారేజ్’తో తెలుగులో మోహన్ లాల్ కి క్రేజ్ పెరిగిపోయింది. దీంతో తెలుగు మార్కెట్ పై ఫోకస్ చేసారాయన. తెలుగులో నాగార్జున హీరోగా ‘ఓప్పం’ రిమేక్ కి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నాగ్ రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భక్తిరస చిత్రం  “ఓం నమోవేంకటేశాయ” షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత నాగ్ ‘ఓప్పం’పై ఫోకస్ చేయనున్నాడు.

‘ఓప్పం’ తెలుగుతో పాటుగా తమిళ్, హిందీ బాషల్లోనూ రిమేక్ కానుంది. తమిళ్ కమల్  కథానాయకుడిగా ఓప్పం రిమేక్ కానుండగా.. హిందీ ఓప్పం రిమేక్ లో
అక్షయ్ కుమార్ నటించబోతున్నారంటూ ప్రచారం  జరుగుతోంది. మొత్తానికి.. మోహన్ లాల్ ‘ఓప్పం’.. ఇప్పుడు అన్ని బాషల్లోకి రిమేక్ కానున్నట్టు
తెలుస్తోంది.

SHARE