ఎన్టీఆర్ లాభంతో మోహన్ లాల్ కి నష్టమా?

Posted September 21, 2016

 mohan lal profit loss janatha garage movie
జనతా గ్యారేజ్ తెలుగు సినీ రంగంలో మళ్లీ ఎన్టీఆర్ కి పూర్వవైభవం తెచ్చిపెట్టిన సినిమా.కలెక్షన్స్ పరంగా టాప్ త్రీ లో చోటు సంపాదించిన ఈ సినిమా కి ఓ మూలస్తంభంలా నిలిచిన మోహన్ లాల్ కి మాత్రం నష్టమే మిగిల్చింది.గ్యారేజ్ పై నమ్మకంతో మలయాళం వెర్షన్ ని మోహన్ లాల్ స్వయంగా కొని రిలీజ్ చేసుకున్నారు.తెలుగులో కాసులు కురిపించిన జనతా గ్యారేజ్ మలయాళీ ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేదు.దీంతో సినిమాపై మోహన్ లాల్ కొద్దోగొప్పో నష్టాన్నే చూడాల్సి వచ్చిందట.పైగా మోహన్ లాల్ క్యారెక్టర్ విషయంలోనూ అక్కడి ప్రేక్షకులు సంతృప్తిగా లేరని ఫీడ్ బ్యాక్ వచ్చిందట.

జనతా గ్యారేజ్ కి ముందు మోహన్ లాల్ తెలుగులోచేసిన మరో సినిమా మనమంతా.చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చేసిన ఈ సినిమాకి మంచి పేరు వచ్చినా తెలుగులో కలెక్షన్స్ నిరాశాజనకంగానే వచ్చాయి.మలయాళం లో ఈ సినిమా ఆర్ధికంగా పర్లేదనిపించింది.పర భాషా సినిమాలతో మార్కెట్ పెంచుకోవచ్చని ఆలోచించిన మోహన్ లాల్ ఈ రెండు అనుభవాలతో రూట్ మార్చేందుకు రెడీ అవుతున్నారట.

SHARE