రజని అల్లుడి సినిమాలో మోహన్ బాబు?

Posted April 14, 2017

mohanbabu acting under dhanush direction
” పవర్ పాండి”… రాజ్ కిరణ్ హీరోగా రజని అల్లుడు ధనుష్ దర్శకత్వం వహించిన చిత్రం. నేడు తమిళనాట రిలీజ్ అయిన ఈ సినిమా స్టోరీ చిత్రమైనది.రిటైర్ అయిన ఓ వ్యక్తి సంతానం తనను చిన్న చూపు చూడడం భరించలేక,తన జీవితాన్ని కొత్తగా మలుచుకోడానికి,కొత్త తోడు వెదుక్కుంటూ వెళ్లడమే ఈ సినిమా కథ.వయసు మళ్ళిన వాళ్ళ ప్రేమకథని చిత్రీకరించడంలో ధనుష్ దర్శకుడు గా సూపర్ సక్సెస్ అయ్యాడు.విడుదలకి ముందే ఈ సినిమా చూసిన రజని దర్శకుడిగా అల్లుడు ప్రతిభకి ఫ్లాట్ అయ్యాడు.ఈ సినిమా ప్రివ్యూ కి మోహన్ బాబు ని కూడా పిలిచారు. ఆ ఫ్రెండ్స్ ఇద్దరికీ ఈ పవర్ పాండి సినిమా బాగా నచ్చింది.

ఒకప్పుడు నాట్టమై సినిమాని తెలుగులో మోహన్ బాబు చేస్తే బాగుంటుందని రజని సూచించారు. అదే పెదరాయుడు గా తెలుగులో ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు పవర్ పాండి సినిమా చూసాక కూడా రజని ఈ సినిమా తెలుగులో చేయమని మోహన్ బాబుని ప్రోత్సహిస్తున్నారట.కలెక్షన్ కింగ్ ఓకే అంటే ఓ వినూత్న పాత్రలో మోహన్ బాబు కనిపిస్తాడట.అయితే ఈ సినిమాకి ధనుష్ దర్శకత్వం వహించే అవకాశం ఉండకపోవచ్చు.ఆ ఛాన్స్ తెలుగులో ఎవరిని వరిస్తుందో ఏమిటో ?

SHARE