రజని చెప్పాడు..మోహన్ బాబు పాటిస్తున్నాడు

Posted [relativedate]

mohanbabu follows rajani words
ఆ దేవుడు చెప్పాడు ,ఈ అరుణాచలం పాటిస్తాడు అని ఓ సినిమాలోని రజని డైలాగు గుర్తుందా? ఇప్పుడు అదే డైలాగు కాస్త మారింది.రజని చెప్పాడు,మోహన్ బాబు పాటిస్తున్నాడు.దేని విషయంలో అనేగా మీ డౌట్.ఓ సినిమా రీమేక్ విషయంలో.రజని అల్లుడు దర్శకత్వం వహించిన పవర్ పాండి చిత్రాన్ని ఈ ఇద్దరు స్నేహితులు కలిసి చూశారట.తమిళ్ లో హీరోగా రాజ్ కిరణ్ చేసిన పాత్రకి తెలుగులో మోహన్ బాబు అయితే బాగుంటుందని రజని అన్నారట.స్నేహితుడి మాట మన్నించిన మోహన్ బాబు ఈ సినిమా రైట్స్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.అయితే ఈ సినిమాకి ధనుష్ కాకుండా ఇంకో దర్శకుడు ఎవరైనా పనిచేసే అవకాశం ఉందట.ఒకప్పుడు పెదరాయుడు సినిమా కూడా రజని సలహా తోటే మోహన్ బాబు తమిళ్ నుంచి రీమేక్ చేసాడు.ఇప్పుడు పవర్ పాండి చేస్తున్నాడు.ఇది కూడా పెదరాయుడు అంత పెద్ద హిట్ అయ్యి మోహన్ బాబు కి కొత్త ఉత్సాహం ఇవ్వాలని కోరుకుందాం.

Leave a Reply