శ్రీకాళ‌హ‌స్తి సీటే కావాలంటున్న మోహ‌న్ బాబు?

Posted March 21, 2017

sri kalahasthi to become city
క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ మ‌ధ్య టీడీపీలో చేరుతార‌న్న ఊహాగానాలొచ్చాయి. కానీ ఎందుక‌నో కుద‌రలేదు. ఇప్పుడు వైసీపీలో చేరుతున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఆ దిశ‌గా మోహ‌న్ బాబు- జ‌గ‌న్ మ‌ధ్య చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయ‌ని టాక్.

మోహ‌న్ బాబు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికీ ఆయ‌న పోటీ చేసే అవ‌కాశాలు త‌క్కువ‌. ఎందుకంటే ఆయ‌న వ‌యోభారం దృష్ట్యా విశ్రాంతిని కోరుకుంటున్నార‌న్న గుసగుస‌లు వినిపిస్తున్నాయి. మోహ‌న్ బాబు బ‌దులు మంచు వారి వార‌సులు రంగం దిగే అవ‌కాశాలున్నాయి. మంచు ల‌క్ష్మీప్ర‌స‌న్న‌, మంచు మ‌నోజ్ ఇద్ద‌రికీ రాజ‌కీయాల‌పై ఆస‌క్తి ఉంద‌ట‌. అయితే మనోజ్ కు ఇంకా చాలా కెరీర్ ఉంది కాబ‌ట్టి .. ల‌క్ష్మీ ప్ర‌స‌న్న వైపు మోహ‌న్ బాబు మొగ్గు చూపే అవ‌కాశ‌ముంది.

ఇక పోటీ చేసే స్థానాన్ని కూడా మోహ‌న్ బాబు కుటుంబం సెల‌క్ట్ చేసుకుంద‌ట‌. శ్రీకాళ‌హ‌స్తి స్థాన‌మైతే గెలుపు ఈజీ అని భావిస్తోంద‌ట‌. ఈ మేర‌కు వైసీపీ అధినేత జ‌గ‌న్ .. త‌న కూతురు మంచి ల‌క్ష్మికి టికెట్ ఇవ్వాల‌ని కోరార‌ట‌. జ‌గ‌న్ మాత్రం ఆ సీటుపై ముందు వెనుక ఆలోచిస్తున్నార‌ట‌. ఎందుకంటే అక్క‌డ ఇది వ‌రకే వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మ‌ధుసూద‌న్ రెడ్డి ఉన్నారు. కాబ‌ట్టి జ‌గ‌న్ బ‌హుశా అది కుద‌ర‌క‌పోవ‌చ్చని.. ఇంకో ఆప్ష‌న్ ఇవ్వాల‌ని చెప్పార‌ట‌. శ్రీకాళ‌హ‌స్తి అయితే 100 శాతం హామీ ఇవ్వలేను కానీ.. ఇంకో ఆప్ష‌న్ ఇవ్వాల‌ని సూచించార‌ట‌. అందుకు కలెక్ష‌న్ కింగ్ మాత్రం శ్రీకాళ‌హ‌స్తే కావాల‌ని గ‌ట్టిగా చెప్పార‌ట‌. దీంతో జ‌గ‌న్ కొంత స‌మ‌యం కావాల‌ని అడిగిన‌ట్టు
స‌మాచారం.

నిజానికి ఇంత‌కుముందే చంద్ర‌బాబుతోనూ మోహ‌న్ బాబు చ‌ర్చించార‌ట‌. టీడీపీలోకి వ‌స్తే శ్రీకాళ‌హ‌స్తి సీటుపై హామీ ఇవ్వాల‌ని కోరార‌ట‌. అక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి బొజ్జ‌ల కృష్ణారెడ్డి ఉన్నారు కాబ‌ట్టి కుద‌ర‌ద‌ని చంద్ర‌బాబు గ‌ట్టిగానే చెప్పార‌ట‌. దీంతో మ‌రోదారి లేక వైసీపీ వైపు మోహ‌న్ బాబు చూస్తున్నార‌ని టాక్. వైసీపీ నుంచైనా టికెట్ సాధించి శ్రీకాళ‌హ‌స్తి టికెట్ సాధించాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంద‌ట మంచువారి కుటుంబం.

మ‌రి మోహ‌న్ బాబు కుటుంబానికి వైసీపీ టికెట్ ఇస్తుందా? శ‌్రీకాళ‌హ‌స్తి నుంచి మంచువారు పోటీకి దిగ‌డం ఖాయ‌మేనా? ఒక‌వేళ వైసీపీ నుంచి టికెట్ రాక‌పోతే మోహ‌న్ బాబు ఏం చేస్తారు? అన్న‌ది చూడాలి!!!.

SHARE