జనతా గ్యారేజ్ సినిమా తెలుగు మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. సినిమాలో కీలక పాత్ర చేస్తున్న మోహన్ లాల్ తన మాత్రు భాషలో సినిమాను భారీ రేంజ్ లో హైప్ తీసుకొచ్చారు. అయితే ముందునుండి జనతా గ్యారేజ్ మలాయళ వర్షన్ లో జూనియర్ ను వెనక్కి నెట్టేస్తున్నారు. సినిమాలో మెయిన్ హీరో యంగ్ టైగర్ అయినా అక్కడ రిలీజ్ పోస్టర్స్ లో ఎన్టీఆర్ కనిపించేవి కన్నా మోహన్ లాల్ ఉన్నవే ఎక్కువ కనబడుతున్నాయట.
అయితే ఇదంతా అక్కడ సినిమాను భారీ మొత్తంలో కొన్న డిస్ట్రిబ్యూటర్స్ చేస్తున్న ట్రిక్స్ అని తెలుస్తుంది. సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న జనతా గ్యారేజ్ ఫలితం మీద చిత్రయూనిట్ అంతా పాజిటివ్ గానే ఉన్నారు. ఈ శనివారం నుండి ప్రమోషన్స్ స్టార్త్ చేయబోతున్న ఎన్టీఆర్ కేరళలో కూడా సినిమా ప్రమోషన్స్ లో భాగమవుతాడని తెలుస్తుంది. టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాల తర్వాత వస్తున్న ఈ జనతా గ్యారేజ్ మరోసారి యంగ్ టైగర్ సత్తా చాటేందుకు సిద్ధమయ్యింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటించగా కాజల్ తో ఐటెం సాంగ్ ప్లాన్ చేశారు దర్శకుడు కొరటాల శివ.