మొహెంజోదారో రివ్యూ…

  mohenjodaro movie review
టైటిల్ : మొహెంజొదారో(హిందీ)
తారాగణం: హృతిక్‌ రోషన్‌.. పూజా హెగ్డే.. అరుణోదయ్‌ సింగ్‌, కబీర్‌ బేడీ.. తదితరులు స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ : అశుతోష్‌ గొవారికర్‌
మ్యూజిక్ : ఎ.ఆర్‌.రెహమాన్‌
ప్రొడ్యూసర్: సిద్ధార్థ్‌రాయ్‌ కపూర్‌, సునితా గొవారికర్‌
రిలీజ్ : 12-08-2016

బాలీవుడ్ లో అశుతోష్ గోవారికర్ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ‘లగాన్‌’, ‘జోధా అక్బర్‌’ వంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమాలను తెరకెక్కించి తన స్పెషాలిటీని ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్ ఆయన. బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్.., అశుతోష్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం మొహెంజోదరో. ఇద్దరూ కష్టపడి రెండేళ్లపాటు తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రెండువేల ఏళ్ల క్రితం నాటి సింధూ నాగరికతను చూపిస్తూ రూపొందిన ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.

స్టోరీ: సింధు నాగరికత కాలంలో సాగిన ఓ లవ్ స్టోరీ ఆధారంగా మొహెంజోదారోను తెరకెక్కించారు. ‘మొహెంజొదారో’ నగరంలో ఆనాటి పరిస్థితులను చూపించే ప్రయత్నంతో సినిమాను తీశారు. సర్మన్‌(హృతిక్‌ రోషన్‌).. మొహెంజొ దారో నగరానికి దగ్గర్లోని అమ్రిపురే అనే చిన్న ఊరికి చెందిన రైతు బిడ్డ. నగరాన్ని చూడాలన్న కోరికతే మొహెంజదారోకు వెళ్తాడు. ఆ నగరాన్ని పాలిస్తున్న రాజు మహాన్(కబీర్ బేడీ). నియంతలా వ్యవహరించే రాజు ఆగడాలకు అమాయకులు బలవుతుంటారు. తనకు ఎదురు చెప్పిన వారిని నిర్దాక్షిణ్యంగా ఉరికంభం ఎక్కిస్తాడు.

అలాంటి క్రూరమైన రాజు పాలనలో ఉన్న మొహెంజోదారో నుంచి వెళ్లిపోవాలని సర్మన్ అనుకుంటాడు. కానీ అక్కడే ఓ పూజారి కూతురైన చానీ (పూజా హెగ్దే)ని చూసి ప్రేమలో పడతాడు. దీంతో అక్కడే ఉండిపోయి ఆమె ప్రేమను గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తాడు. మరోవైపు చానీని తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలని రాజు కోరిక. అప్పుడు చానీని సర్మన్ ఎలా ప్రేమలో దింపాడు. అమెను ఎలా సొంతం చేసుకున్నాడు? రాజును ఎలా ఎదిరించి నిలబడ్డాడన్నదే మిగిలిన కథ.

ఎలా ఉంది?: హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ కథలో సినిమా తీయాలంటే పెద్ద సవాలే. కానీ అశుతోష్ గోవారికర్ కు అది చిన్న విషయమే. గతంలో హిస్టారికల్ సినిమాలు తీసిన అనుభవమున్న అశుతోష్ అదే స్థాయిలో మొహెంజోదారోని తీర్చి దిద్దాడు. సింధూ నాగరికత నాటి పరిస్థితులపై ఎవరికీ అవగాహనలేదు. కానీ అనాటి ఓ ప్రేమ కథను ఊహించి రాశాడు దర్శకుడు.

ఫస్ట్ హాఫ్ అంతా నటీనటుల ఇంట్రడక్షన్, సర్మన్.., చానీల ప్రేమకథే ప్రధానంగా సాగుతుంది. సెకండ్ హాఫ్ లో హీరో చేసే పోరాటాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అలాగే ఎమోషనల్ సీన్స్ ను కూడా బాగానే తెరకెక్కించారు. సింధూనది పొంగినప్పుడు ప్రజలను హీరో రక్షించే సన్నివేశం సూపర్ గా ఉంటుంది. సింధూ నాగరికతపై గురించి ఎవరికీ తెలియదు గనుక డైరెక్టర్ తన ఊహనే తెరకెక్కించాడు. అయితే.. సినిమాలో సింధు నాగరికత నాటి పరిస్థితులను, అప్పడి ప్రజల సాంప్రదాయాలన్నింటినీ చూడొచ్చని థియేటర్ కు వెళ్లినవారికి నిరాశతప్పదు. ఓ లవ్ స్టోరీకి ఆనాటి బ్యాక్ డ్రాప్ ను వాడుకున్నట్లు చిత్రం అనిపిస్తుంది.

ఎవరెలా?: ఫైటింగ్ సీన్స్ లో హృతిక్ రోషన్ బాగా నటించాడు. హీరో-హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగానే కుదిరింది. కొన్ని సన్నివేశాల్లో హృతిక్ సరిగా పర్ఫార్మ్ చేయలేదేమో అనిపిస్తుంది. బాలీవుడ్ లో ఫస్ట్ సినిమా చేసిన పూజా హెగ్దే రోల్ పరిమితంగానే ఉంది. సినిమాలో చాలా అందంగా కనిపించింది.

ప్లస్ పాయింట్స్
స్టోరీ, స్క్రీన్ ప్లే
హృతిక్ రోషన్, పూజా హెగ్దే
మైనస్ పాయింట్స్
-స్క్రిప్ట్‌
సింధు నాగరిగతను కొన్నిసీన్లకే పరిమితం చేయడం

రేటింగ్: 3/5

SHARE