జయ ఆస్తులు సర్కార్ సొంతమా..?

0
237

Posted [relativedate]

"Mom" Pill said the assets owned by the peopleఅమ్మ ఆస్తులను పబ్లిక్ ఆస్తులుగా ప్రకటించాలని గరీబ్ గైడ్ అనే ఓ స్వంచ్ఛంద సంస్థ కోర్ట్ లో వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. తమిళ నాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు దేశం లో అనేక పట్టణాల్లో విలువైన ఆస్తులు వున్నాయనే విషయం తెలిసిందే అదే తరహా లో కూడా హైదరాబాదులో సైతం కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులు వున్నాయి . రామ కృష్ణ పురం అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ లో కూడా ఆమె తన ఆస్తుల విలువను రూ. 113.73 కోట్లుగా ప్రకటించారు. ఇందులో హైదరాబాదులోని మేడ్చల్ లో 14 ఎకరాల ఫాంహౌస్, శ్రీనగర్ కాలనీలో కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నట్టు చెప్పారు.

పిల్ లో జయలలిత తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారని… ఆమె సోదరుడు జయకుమార్ కూడా 1995లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని… దీంతో, ఆమె ఆస్తులను పొందే వ్యక్తులు ఎవరూ లేరని పేర్కొంది. ఎలాంటి రక్త సంబంధం లేని శశికళకు జయలలిత ఆస్తులు పొందే హక్కు ఏమాత్రం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో, నగరంలోని జయ ఆస్తులను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పిటిషన్ లో కోరింది. ఈ ఆస్తులను పబ్లిక్ ప్రాపర్టీగా ప్రకటించాలని కోరింది .

Leave a Reply