పిచ్చి కోతి పై జిహెచ్ఎమ్ సి యుద్ధం.

Posted November 30, 2016, 7:12 pm

Image result for monkey

అసలే కోతి ఆ పై పిచ్చి కూడా పట్టిందట ఇంకా చెప్పాలా రచ్చ రచ్చే ..ఇప్పటికి 90 మందిని కరిచి గాయాల పాలు చేసిందట ఆ కోతి దీనితో ఇక పట్టుకోక తప్పదని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు భావించారట. హైదరాబాద్‌లోని సైదాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో నివ‌సిస్తోన్న ప్ర‌జ‌ల‌కు కోతి భ‌యం ప‌ట్టుకుంది. పొద్దునే నిద్ర‌లేచి వీధుల్లోకి రావాలంటే అక్క‌డి ప్ర‌జ‌లు ఎక్క‌డ కోతి వ‌చ్చి క‌రుస్తుందోన‌ని భ‌య‌ప‌డుతున్నారు.

జీహెచ్‌ఎంసీ సిబ్బంది త‌మ‌ కమిషనర్‌ జనార్ధ‌న్‌ రెడ్డి ఆదేశాల మేరకు క‌దిలారు. వారితో పాటు ఈ రోజు వెటర్నరీ, మున్సిపల్‌, జూపార్క్‌ సిబ్బంది కూడా ఆ కోతిని ప‌ట్టుకోవ‌డానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని వ‌చ్చారు. కోతి భయంతో ఇప్ప‌టికే కొంద‌రు ఇళ్లు వదిలి వేరే ప్రాంతాల‌కు వెళ్లిపోయారు. ప్ర‌జ‌ల‌ను ముప్ప‌తిప్ప‌లు పెడుతున్న‌ కోతిని త్వ‌ర‌లోనే బంధించి తీసుకెళ్తామ‌ని, వార్ ఇప్పుడే ప్రారంభించామని అంటున్నారు ..