ఆమ్మో 1 వ తారీకు.. కష్టాలు…వచ్చాయ్

0
741
india-currency-demonetisation

Posted [relativedate]

ఆమ్మో ఒకటో తారీకు వచ్చేసింది .గిర్రున తిరిగాయే రోజులు అని పిస్తోంది ఓవైపు డబ్బు వున్నా తీసుకొని వాడుకో లేని పరిస్థితి… చేతిలో ఉన్న సొమ్ము చెల్లక ఏమీ చేయాలో తెలియని పరిస్థితి. పోనీ చేస్తున్న పనిని పక్కన పెట్టి ఎటిఎం లో డబ్బులు తీసుకుందామా అంటే ఉన్న వుద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియని డోలాయమానం లో అలా …భార్య దగ్గరో ఎప్పుడో దాచుకున్న పాత కిడ్డీ బ్యాంకులో పప్పు చిల్లరో ఒబ్బిడిగా వాడుకొంటూ ఉండగా మరో గుది బండ గా 1 వ తారీకు వచ్చేసింది. ఇప్పుడు అకౌంట్ లో ఉన్న జీతం డబ్బులు తీయడం కోసం ఐనా క్యూ లో నిలబడి చచ్చినట్టు మన వంతు కోసం వేచి చూడాల్సిందే..ఇలా సామాన్యుడి కష్టాలు మొదలై నెల గడిచి పోయింది..

వేతనం బ్యాంకు ఖాతాలో పడుతుందా… పడినా అది జేబు దాకా వస్తుందా… బ్యాంకుల ముందు పడిగాపులు తప్పవా.. పచారీ కొట్టు నుంచి పాల బిల్లు దాకా… క్రెడిట్ కార్డు ఈఎంఐ చెల్లించేదెలా? పెద్ద నోట్ల రద్దు తో ఏటీఎంలు రెస్ట్ తీసుకోవడం మొదలు పెట్టి నెల ఐపోతోంది సుమారుగా బ్యాంకుల పరిస్థితీ అంతంతమాత్రంగానే ఉంది. ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని నవంబరు మొదటి వారం లో ఐనా అప్పటికే చాలావరకూ జీతాలు ,ఇతర చెల్లింపులు జరిగిపోయాయి పోయిన నెల పెద్దగా ఇబ్బంది లేకపోయింది. కానీ.. ఇప్పుడలా కాదు. నోట్ల రద్దు తర్వాత జీతాలు పడే తొలిరోజు.. గురువారం. సాధారణంగా ఖాతాలో జీతం పడిన తొలి వారంలోనే చెల్లింపుల నిమిత్తం 50 శాతం నుంచి 70 శాతం దాకా విత డ్రా చేస్తుంటారు. ఆర్బీఐ నోటిఫికేషన్‌ ప్రకారం కూడా.. వారానికి రూ.24 వేల దాకా తీసుకునే వీలుంది. కానీ, ఇన్నాళ్లూ నగదు కొరత పేరిట బ్యాంకులు రూ.2 నుంచి 4 వేలే చేతిలో పెట్టి పంపిస్తున్నాయి.నెల మొదట్లో పలు చెల్లింపులు చేయాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడలా చేస్తే సహిస్తారా? విరుచుకుపడబోయే ప్రజల్ని బ్యాంకులు సమర్థంగా సమాధాన పరచ గలుగుతాయా. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటాయి? డిమాండ్‌ను తట్టుకునేందుకు వీలుగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకూ అదనపు నగదు పంపేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు అంటున్నారు.

ఏటీఎంలు పూర్తిస్థాయిలో పనిచేయక పోవడం వల్ల, గురువారం ఒక్కరోజే కాక డిసెంబరు తొలివారమంతా బ్యాంకుల ముందు పెద్ద ఎత్తున క్యూలు ఉంటాయని, ఇందుకు తగినట్టుగా ఆర్బీఐ నుంచి నోట్లు వచ్చే అవకాశం లేనందున బ్యాంకులే వితడ్రాయల్‌ పరిమితిని తగ్గించారు. పాత నోట్ల మార్పిడిని నిలిపివేసినందున.. సాధారణ ప్రజలు తమ వద్ద ఉన్న పాత నోట్లను జమ చేయడం ఇప్పటికే దాదాపుగా పూర్తయినందున.క్యూ లు అంతగా ఉండకపోయినా విత్ డ్రా క్యూ లైన్ లు మాత్రం కిలోమీటర్ల మేర వున్నాయి.బుధవారం సాయంత్రం నుంచే బ్యాంకులకు నగదు సరఫరా పెంచింది. డిమాండును తట్టుకునేలాగా.. డిసెంబరు 7 దాకా నగదు సరఫరాను పెంచనుంది.శాలరీ, పెన్షన్‌ ఖాతాలు ఉన్న బ్యాంకు శాఖలకు రోజువారీ నగదు అవసరాలకన్నా 20-30 శాతం అధికంగా నగదు సరఫరా చేయనుంది ప్రస్తుతం 2000 నోట్ల ముద్రణను తగ్గించి.. రూ.500 నోట్లను ముద్రిస్తున్నారు..ప్రభుత్వం యుద్ధ ప్రతి పదికన ఎన్ని చర్యలు తీసుకొంటున్న బ్యాంకు ల్లో మాత్రం రద్దీ విపరీతం గా వుంది. లైన్ లో నిలబడి న వారికి నగదు పరిమితి ని ముందే హెచ్చరిస్తున్నారు దీంతో మనీ విత్ డ్రా కోసం వచ్చిన వారి పరిస్థితి అగమ్య గోచరం గా వుంది.

Leave a Reply