చంద్రుడు తర్వాత సూర్యుడు- ఇస్రో కొత్త ప్లాన్

0
556

  moon after sun isro new planభారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈసారి ఏకంగా మిషన్ ఆదిత్య అంటోంది ఇస్రో. 2020లో తమ మిషన్ కార్యరూపం దాలుస్తుందని చెబుతున్నారు అధికారులు. సూర్యుడిపై విస్తృత పరిశోధనల కోసం ‘ఆదిత్య-ఎల్‌1’ ఉపగ్రహాన్ని 2020లో ప్రయోగించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు బెంగళూరులోని ఇస్రో శాటిలైట్ సెంటర్ డైరెక్టర్  మైలాస్వామి అన్నాదురై.

ఆదిత్య-ఎల్‌1లో ఆరు పరిశోధన పరికరాలు ఉంటాయి. సౌర గాలులు, జ్వాలలు, రేణువుల తీరు తెన్నుల గురించి ఇది పరిశోధిస్తుంది. సౌర తుపాను సమయంలో వెలువడే ఈ రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతుంటాయి. దీంతోపాటు కాంతి మండలం (ఫొటోస్పియర్‌), వర్ణ మండలాలను (క్రోమోస్పియర్‌) అధ్యయనం చేస్తారు. ఈ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్‌ రాకెట్‌ ద్వారా శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తారని చెప్పారు.

Leave a Reply