మోత్కుప‌ల్లికి గ‌వ‌ర్న‌ర్ యోగం లేన‌ట్టేనా?

86

Posted [relativedate]

motkupalli not going to become governor
తెలంగాణ టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుల్లో ఒక‌రు మోత్కుప‌ల్లి న‌ర్సింహులు. పార్టీ క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్ప‌టికీ… ఆయ‌న పార్టీని వీడ‌కుండా అలాగే ఉండిపోయారు. ఆయ‌నకు స‌న్నిహితులైన నాయ‌కులంతా టీఆర్ఎస్ లో చేరిపోయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న మాత్రం పార్టీనే న‌మ్ముకొని ఉన్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఆయ‌న‌కు త‌గిన న్యాయం చేస్తార‌ని అనుకున్నారు. అందులో భాగంగానే మోత్కుప‌ల్లిని గ‌వ‌ర్న‌ర్ ను చేసేందుకు బాబుగారు గ‌ట్టిగానే లాబీయింగ్ చేశారు. ఈ ప‌రిణామాల‌తో తాను గ‌వ‌ర్న‌ర్ కావ‌డం ఖాయ‌మ‌ని మోత్కుప‌ల్లి త‌న స‌న్నిహితుల‌తోనే చెప్పుకున్నారు.

ఒక‌ద‌శ‌లో త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ గా మోత్కుప‌ల్లి వ‌చ్చేస్తున్నార‌ని గ‌ట్టిగా ప్ర‌చారం జ‌రిగింది. అంతా అయిపోయింది.. ప్ర‌క‌టించడ‌మే ఆల‌స్యం అని అనుకున్నారు… కానీ ఏమైందో కానీ అస‌లు మోత్కుప‌ల్లి పేరు కూడా ప‌రిశీల‌న‌లోకి రాలేద‌ట‌. తాజాగా మ‌రోసారి కూడా చంద్ర‌బాబు కేంద్ర‌పెద్ద‌ల‌తో మాట్లాడార‌ట‌. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాతోనూ ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించార‌ని టాక్. కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడుకు కూడా చాలాసార్లు మోత్కుప‌ల్లి టాపిక్ ను గుర్తు చేశార‌ట‌. పాపం.. బాబుగారు శ‌క్తివంచ‌న లేకుండా లాబీయింగ్ చేస్తున్నా… ఎందుక‌నో వ‌ర్క‌వుట్ కావ‌డం లేద‌ట‌.

ఈ మ‌ధ్య మోత్కుప‌ల్లి న‌ర్సింహులు.. చంద్ర‌బాబును క‌లిశార‌ట‌. మోత్కుప‌ల్లితో మాట్లాడుతూ… బాబు మొద‌ట తానే గ‌వ‌ర్న‌ర్ గిరీ ఇవ్వ‌లేక‌పోతున్నాన‌ని చెప్పుకొచ్చార‌ట‌. ఎంత ప్ర‌య‌త్నించినా సాధ్యం కావ‌డం లేద‌ని .. కొంత ఓపిక‌గా ఉండాల‌ని సూచించార‌ట‌. దీంతో మోత్కుపల్లి కూడా మెత్త‌బ‌డ్డార‌ట‌. ఇక ఆయ‌న‌కు గ‌వ‌ర్న‌ర్ గిరీ రావ‌డం క‌ష్ట‌మేన‌ని టాక్. అన్నీ కుదిరితే ఆస్థాయి ప‌ద‌వి ఏదైనా ఆయ‌న‌ను వ‌రించ‌డం మాత్రం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ఎందుకంటే బాబుగారు ఆయ‌న విష‌యంలో అంత సీరియ‌స్ గా ఉన్నార‌ట మ‌రి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here