‘నీ జతలేక’ పై నాగశౌర్య ఇంటర్వ్యూ….

 

 nee jatha leka interview naga sourya

ఊహలు గుసగుసలాడే‘, ‘లక్ష్మిరావే మా ఇంటికి‘, ‘కళ్యాణ వైభోగమే‘ వంటి హిట్‌ చిత్రాల్లో నటించిన యంగ్‌ ప్రామిసింగ్‌ హీరో నాగశౌర్య లేటెస్ట్‌ గా నీ జతలేక‘ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శ్రీసత్యవిధుర మూవీస్‌ పతాకంపై లారెన్స్‌ దాసరి దర్శకత్వంలో అన్‌కాంప్రమైజ్డ్‌ ప్రొడ్యూసర్స్‌ జి.వి. చౌదరినాగరాజుగౌడ్‌ చిర్రా సంయుక్తంగా నిర్మించిన నీ జతలేక‘ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్టు 13న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా హీరో నాగశౌర్యతో ఇంటర్వ్యూ.

నీ జతలేక‘ కాన్సెప్ట్‌ ఏంటి?

– అమ్మాయి లేకుండా అబ్బాయి ఉండలేడు. అలాగే అబ్బాయి లేకుండా అమ్మాయి ఉండలేదు. అలాంటి అమ్మాయి అబ్బాయికి ఎలాంటి హెల్ప్‌ చేసిందిఅతను ఎలాంటి ప్రయోజకుడు అయ్యాడు అనేది కాన్సెప్ట్‌. బేసిక్‌గా ఇది ఒక ప్రేమకథ. ఇప్పుడున్న యూత్‌ ట్రెండ్‌కి కనెక్ట్‌ అయ్యేవిధంగా ఈ చిత్రం ఉంటుంది. ఫ్రెష్‌ ఫీల్‌తో సీన్స్‌ అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. తప్పకుండా ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది.

ఈ సినిమాలో మీ క్యారెక్టర్‌ ఎలా ఉంటుంది?

– సినిమా చూస్తే నా క్యారెక్టర్‌ ఏంటో తెలుస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే మోడల్‌గా ఈ చిత్రంలో యాక్ట్‌ చేశాను. ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్‌ చేయలేదు. చాలా కొత్తగా డిజైన్‌ చేశారు లారెన్స్‌. సినిమా చేసేటప్పుడే నాకు కొత్తగా అనిపించింది.

డైరెక్టర్‌ లారెన్స్‌ టేకింగ్‌ ఎలా ఉంది?

– ప్రజెంట్‌ ట్రెండ్‌కి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు లారెన్స్‌. మంచి స్క్రిప్ట్‌. చాలా ఫ్రెష్‌ సబ్జెక్ట్‌ తో ఈ సినిమాని రూపొందించారు. సినిమా అంతా చాలా క్లీన్‌గా ఉంటుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫిలిం. ట్రీట్‌మెంట్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక లవ్‌స్టోరీ చిత్రాన్ని బ్యూటిఫుల్‌గా తెరకెక్కించారు లారెన్స్‌ దాసరి.

నిర్మాతల సహకారం ఎలా ఉంది?

– శ్రీ సత్యవిదుర మూవీస్‌ ప్రొడక్షన్‌ వాల్యూస్‌ బ్రహ్మాండంగా ఉన్నాయి. చౌదరిగారునాగరాజుగౌడ్‌ ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ఈ చిత్రాన్ని అద్భుతంగా నిర్మించారు. ఫస్ట్‌ సినిమా అయినా కూడా ఎంతో ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న నిర్మాతల్లా చేశారు. మంచి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంటర్‌ అవుతున్నారు. నెక్ట్స్‌ పెద్ద హీరోలతో మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను.

ఆడియోకి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోంది?

– స్వరాజ్‌ మంచి ఆల్బమ్‌ ఇచ్చారు. సాంగ్స్‌ అన్నీ చాలా బాగున్నాయి అంటున్నారు. యు ట్యూబ్‌లో ట్రైలర్‌కిపాటలకు మంచి వ్యూస్‌ వస్తున్నాయి. ఆడియో సక్సెస్‌ అయి ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ కూడా జరుపుకున్నాం. కరుణాకరన్‌ మంచి బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అందించారు. ఆర్‌ఆర్‌తో సినిమా ఇంకా ఎలివేట్‌ అయింది.

పాటల్ని ఎక్కడెక్కడ షూట్‌చేశారు?

– బ్యాంకాక్‌లోని అందమైన ప్రదేశాల్లో రెండు పాటల్ని చిత్రీకరించాం. మిగిలిన పాటల్ని వైజాగ్‌హైదరాబాద్‌లో షూట్‌ చేశాం. రఘు మాస్టర్‌ మంచి కొరియోగ్రఫి చేశారు. ఫస్ట్‌టైం ఈ చిత్రంలో డాన్స్‌లు నాతో బాగా చేయించారు. ఈ క్రెడిట్‌ అంతా రఘు మాస్టర్‌కే చెందుతుంది.

హీరోయిన్స్‌ పర్ఫామెన్స్‌ గురించి?

– పారుల్‌సరయు ఇద్దరూ టాలెంటెడ్‌ ఆర్టిస్టులు. ఇద్దరూ వాళ్ల పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. గ్లామర్‌గానే కాకుండా పర్ఫామెన్స్‌ పరంగా చక్కగా నటించారు.

ఈ సినిమాలో హైలైట్స్‌ ఏంటి?

– కెమెరామెన్‌ బుజ్జి ప్రతి ఫ్రేమ్‌ని బ్యూటిఫుల్‌గా చిత్రీకరించారు. ఇంట్రడక్షన్‌ సీన్‌తో పాటు ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ హైలైట్‌గా నిలుస్తుంది. అలాగే స్వరాజ్‌ మ్యూజిక్‌లారెన్స్‌ దాసరి టేకింగ్‌ వండర్‌ఫుల్‌గా ఉంటుంది. చౌదరి,నాగరాజుగౌడ్‌ మేకింగ్‌ హైలైట్‌గా నిలుస్తాయి.

వరుసగా సినిమాలు చేస్తున్నారు?

– అది నా అదృష్టం. అవకాశాలు వచ్చినపుడు వరుసగా చేయాలి. లేకపోతే ఎలాగూ ఖాళీగా వుంటాం కదా. చాలా మంది హీరోలు ఉన్నారు కదాఈ టఫ్‌    కాంపిటీషన్‌లో మీరెలా నెగ్గుకు రాగలుగుతున్నారు?

– ఇక్కడ ఎవరి టాలెంట్‌ వారిది. యాక్టింగ్‌ నేర్చుకున్నంత మాత్రాన యాక్టింగ్‌ రాదు. డాన్స్‌ నేర్చుకున్నంత మాత్రాన డాన్స్‌ రాదు. మెయిన్‌గా లక్‌ ఉండాలి. సినిమా పట్ల ప్యాషన్‌ ఉండాలి. నాకంటే టాలెంట్‌ ఉన్న వాళ్లు కృష్ణానగర్‌ఇంద్రానగర్‌చాలాచోట్ల ఎంతో మంది ఉన్నారు. అవకాశాలు రావాలి. వస్తే అందరూ అదృష్టవంతులే.

జి.వి. చౌదరిగారి బ్యానర్‌లో సినిమా ఎప్పుడు?

– స్క్రిప్ట్‌ డిమాండ్‌ చేస్తే తప్పకుండా చేస్తాను. చిన్న బ్యానర్‌పెద్ద బ్యానర్‌ అనే తేడా ఉండదు. చౌదరిగారు మంచి నిర్మాత. ఆయన మహేష్‌ఎన్టీఆర్‌లతో సినిమాలు ప్లాన్‌ చేస్తున్నారు.

స్మిత …సావిత్రి అయ్యింది..

director nag aswin next movie
ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో ఈ కుర్రాడి దగ్గర విషయముందనిపించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్ .తర్వాత సినిమా ఏంటా అనుకొంటుంటే … మహానటి సావిత్రి జీవితాన్ని తెరకెక్కించడానికి పూనుకున్నాడు.ఎంత ధైర్యం అనుకునేలోపే మరో షాక్ ..ఆ పాత్రకు బాలీవుడ్ నటి విద్యాబాలన్ ని ఎంచుకున్నాడు .ఈమె స్మిత ప్రధాన పాత్రలో తీసిన డర్టీ పిక్చర్ లో అదరగొట్టింది .శృంగార పాత్రలో రెచ్చిపోయిన బాలన్ ని సావిత్రి పాత్రకు ఎంచుకోవడం పెద్ద సాహసమే .

విద్య కళ్ళు …రూపురేఖలు సావిత్రి పాత్రకు సరిపోతాయని అశ్విన్ ఆలోచన .ఇది ఒక ఎత్తు అయితే సావిత్రి జీవితాన్ని ఏ కోణం లో చూపుతాడన్నది డైరెక్టర్ ఎదుర్కొనే మరో సవాల్ ..ఈ సవాళ్ళను అధిగమించే దమ్ము అశ్విన్ కి ఉందనిపిస్తోంది …అందుకు సాక్ష్యమే వెండితెర స్మిత …సావిత్రి కూడా కావడం

వెంకీ రాజగారి గదిలోకి వెళ్తాడా?

venky rajugarigadi sequel
ఫ్యామిలీ హీరోగా ఇన్నాళ్లు ప్రేక్షకుల్ని అలరించిన వెంకీ మనసిప్పుడు భీభత్స రసాన్ని కోరుకుంటోందా ?ఔననే ఫిలిం నగర్ టాక్ ..అయన ఓ హారర్ మూవీ లో నటించడానికి ఓకే చెప్పారంట .అది కూడా చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టిన రాజుగారిగది సీక్వెల్ అంట .డైరెక్టర్ ఆ సినిమా తీసిన ఓంకార్ .ఇప్పటికే మూలకథకు వెంకీ తల ఊపాడంట .పకడ్బందీగా స్క్రిప్ట్ రూపొందించే పనిలో ఓంకార్ బిజీ అంట…ఆ పని కాగానే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లొచ్చని సమాచారం .

‘ స‌న్ షైన్ మ్యూజిక్ టూర్స్ అండ్ ట్రావెల్స్’ వచ్చేస్తుంది ..

 sunshine music tours and travels

శైలేంద‌ర్ సింగ్ తెర‌కెక్కించిన బాలీవుడ్ మూవీ స‌న్ షైన్ మ్యూజిక్ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఈ చిత్రంలో విక్కీ కౌశ‌ల్ త‌మ్ముడు స‌న్నీ కౌశ‌ల్ హీరోగా న‌టించారు. మ్యూజిక్ఎపిక్ ట్రావెల్ & క‌డుపుబ్బా న‌వ్వించే హ‌స్యంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. యూత్ టార్గెట్ గా రూపొందించిన స‌న్ షైన్ మ్యూజిక్ అండ్ ట్రావెల్స్ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 2న రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు శైలేంద‌ర్ సింగ్ మాట్లాడుతూ…

30 ఏళ్ల కెరీర్ లో 72 చిత్రాలు, 2,000 యాడ్ ఫిల్మ్స్ ను నిర్మించాను. అలాగే బాలీవుడ్ కు ఎంతో మంది న‌టీన‌టులుసాంకేతిక నిపుణుల‌ను ప‌రిచ‌యం చేసాను. ఇన్నాళ్ల అనుభ‌వంతో ఫ‌స్ట్ టైమ్ స‌న్ షైన్ మ్యూజిక్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే చిత్రాన్ని తెర‌కెక్కించాను.

ఈ చిత్ర క‌థ గురించి చెప్పాలంటే…బాంబే టూ గోవాజింద‌గీ నా మిలేగి దుబారా వంటి చిత్రాల‌కు కొన‌సాగింపులా ఉంటుంది. క‌ల‌లు నిజం అవుతాయి అనే సామెత‌ను నిజం చేస్తూ…ఈ చిత్రాన్ని నిర్మించిన హేరె ఎంట‌ర్ టైన్మెంట్ ఈ చిత్రానికి నిజ‌మైన హీరో. భిన్న నేప‌ధ్యాల‌తో ఆధునాత‌న భావాలు క‌లిగిన యువ‌కులు ఒక పెద్ద క‌ల‌ను అనుస‌రించ‌డం పై జ‌రిగే క‌థాంశంతో ఈ చిత్రం రూపొందించాం. ఈ చిత్రంలో 14 ప్ర‌త్యేక‌మైన ఆక‌ర్ష‌ణ క‌లిగిన పాత్ర‌లు ఉన్నాయి. ప్రేక్ష‌కుల్లో ప్ర‌తి ఒక్క‌రు ఈ పాత్ర‌ల‌తో ప్రేమ‌లో ప‌డ‌డం ఖాయం. ఈ నెల 25న ఈ మూవీ టీజ‌ర్ & ట్రైల‌ర్ ను రిలీజ్ చేసాం. నానాప‌టేక‌ర్ష‌హిద్ క‌పూర్వ‌రుణ్ ధావ‌న్రాజ్ దీప్ స‌ర్ధేశాయి త‌దిత‌రులు టీజ‌ర్ట్రైల‌ర్ చాలా బాగుంది అంటూ అభినందించారు అన్నారు.

జక్కన్న ప్రివ్యూ ….

sunil jakkanna movie preview

చిత్రం : జక్కన్న (2016)
నటీనటులు : సునీల్, మన్నారా చోప్రా, సప్తగిరి, కబీర్ దుల్హన్ సింగ్
సంగీతం : దినేష్
దర్శకుడు : వంశీ కృష్ణ ఆకెళ్ల
నిర్మాత : సుదర్శన్ రెడ్డి, ఆయుష్ రెడ్డి, అక్షిత్ రెడ్డి
విడుదల తేదీ : 29 జులై, 2016.

స్టార్ కమెడియన్ నుంచి హీరోగా ప్రమోటైన సునీల్.. హీరోగా తనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకోవాలని తెగ ట్రై చేస్తున్నాడు. ఎస్.ఎస్ రాజమౌళి ‘మర్యాద రామన్న’ ఒక్కటే సునీల్ కి బ్లాక్ బస్టర్ హిట్టిచ్చింది. అందాల రాముడు, పూలరంగడు ఫర్వాలేదనిపించాయి. ఇక, ఆ తర్వాత వచ్చిన సునీల్ సినిమాలు మిస్టర్ పెళ్లికొడుకు, భీమవరం బుల్లోడు, క్రిష్ణాష్టమి బాక్సాఫీస్ దగ్గర ఫట్టుమన్నాయి. ఇప్పుడు సునీల్ కి అర్జెంట్ గా ఓ హిట్ కావాలి. అందుకోసం ఈసారి ‘జక్కన్న’గా మారాడు సునీల్. వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సునీల్ సరసన మన్నారా చోప్రా జతకట్టనుంది.

ఇదో కామెడీ ఎంటర్ టైనర్. సునీల్ మార్క్ కామెడీతో దర్శకుడు ‘జక్కన్న’ని చెక్కాడని చెబుతున్నారు. ‘ప్రేమ‌క‌థాచిత్ర‌మ్’ త‌రువాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన చిత్రమిది. సుదర్శన్ రెడ్డి, ఆయుష్ రెడ్డి, అక్షిత్ రెడ్డి నిర్మాతలు. ప్రేక్షకుల్లో నవ్వులు పూయించేందుకు సునీల్ ‘జక్కన్న’గా (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరి.. ఓ విజయం కోసం ఆశగా ఎదురు చూస్తున్న ‘జక్కన్న’ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించగలుగుతాడా..? సునీల్ ‘జక్కన్న’ విశేషాలపై ఓ లుక్కేద్దాం పదండీ..

ప్రివ్యూ :
*  గణేష్ (సునీల్) విలువలు కలిగిన వ్యక్తి. పర్ఫెక్షన్ కోరుకునే గణేష్.. ఎవరైనా సాయం చేస్తే. వారికి జీవితాంతం సాయం చేసే వ్యక్తిగా సునీల్
కనిపించనున్నాడు.
* ‘జక్కన్న’.. టైటిల్ తో సినిమాలో రాజమౌళిని భాగం చేశారు
* ఎందుకంటే రాజమౌళిని అందరూ జక్కన్న అని పిలుస్తుంటారు.
* జక్కన్న శిల్పాలను ఎంత అద్భుతంగా చెక్కుతాడో రాజమౌళి తన సినిమాలని అంత అందంగా చెక్కుతాడన్న మాట.
*  టాలీవుడ్ ఇదివరకే పరిచయమున్న పేరు జక్కన్న సినిమా రావడం కలిసొచ్చే అంశం
* జక్కన్న హీరో సునీల్ అవ్వడం మరో ప్లస్ పాయింట్
* సునీల్ కామెడీ బాగా పండించగలడు.. ఇది అందరికీ తెలిసిన విషయమే.
* జక్కన్నలో కూడా కావాల్సినంత కామెడీ ఉండనుందని చిత్రబృందం చెబుతోంది.
* ఫస్ట్ ఆఫ్ లో కథని, పాత్రల తీరుని పరిచయం చేసిన దర్శకుడు
* సెకాండాఫ్ లో కడుపుబ్బ నవ్వించే సీన్స్ రాసుకొన్నాడట.
* సో.. సెకాండాఫ్ సినిమాకి ప్రధాన బలంగా చెబుతున్నారు.
* దర్శకుడు వంశీ అరికెళ్ల.. సినిమాని అద్భుతంగా తీశాడని చెప్పుకొంటున్నారు
* కథకి సునీల్ మార్క్ కోటింగ్ కొట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడట.
* ఇదే నిజమైతే సినిమా ఫలితం పాజిటివ్ రావొచ్చు.
* హీరోయిన్ మన్నారా చోప్రా చూడ్డానికి బాగుంది. ఏ మాత్రం ఎక్స్ ప్రెషన్స్ పండించగలిగినా సరిపోద్ది.
* ఇక, సునీల్ కి తోడు కమెడియన్ సప్తగిరి కూడా ఉండటం కలిసొచ్చే అంశం.
* ఇప్పటికే జక్కన్నకి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేసింది
* జక్కన్న ఆడియో వేడుకకి మెగాస్టార్ చిరంజీవి రావడంతో మరింత హైప్ ని క్రియేట్ చేసింది.
* మెగా అభిమానులు కూడా జక్కన్న ని ఆదరిస్తే.. సునీల్ కి ఓ విజయం దక్కినట్టే.
* ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్స్ తో సునీల్ టెంమ్ట్ చేస్తున్నాడు.

మొత్తానికి.. సరదగా.. కాసేపు టెన్షన్స్ కి దూరంగా హాయిగా నవ్వుకోవాలంటే సునీల్ జక్కన్నకి వెళ్లొచ్చని చెబుతోంది చిత్రబృందం. ఈ చిత్రం లైవ్ అప్ డేట్స్, పూర్తి రివ్యూ కోసం క్లిక్ చేస్తూనే ఉండండి మీ.. తెలుగు బుల్లెట్ డాట్ కామ్.

మాజీ ప్రధాని మనవడు ‘జాగ్వార్‌’…

nikhil kumar movie jaguar
75 కోట్ల భారీ బడ్జెట్‌తో మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, కన్నడంలో అనేక సూపర్‌హిట్‌ చిత్రాలు నిర్మించిన హెచ్‌.డి. కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ చెన్నాంబిక ఫిలింస్‌ పతాకంపై శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మిస్తున్న భారీ చిత్రం ‘జాగ్వార్‌’. ఫస్ట్‌లుక్‌, టీజర్‌ని జూలై 31న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ పార్క్‌ హయత్‌లో తెలుగు సినీ ప్రముఖుల సమక్షంలో రిలీజ్‌ చేస్తున్నారు.
 
‘బాహుబలి’, ‘భజరంగి భాయ్‌జాన్‌’ చిత్రాలతో ప్రపంచమంతటా సంచలనం సృష్టించిన గొప్ప కథా రచయిత విజయేంద్రప్రసాద్‌ ఈ ‘జాగ్వార్‌’ చిత్రానికి కథ అందించారు. నటసింహ బాలకృష్ణతో ‘మిత్రుడు’ వంటి హిట్‌ చిత్రాన్ని అందించిన ఎ.మహదేవ్‌ ఈ చిత్రానికి స్క్రిప్ట్‌, మాటలు, దర్శకత్వం చేస్తున్నారు. 50కి పైగా చిత్రాలకు సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ చేసిన యస్‌.యస్‌. థమన్‌ ఈ చిత్రానికి సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. ‘రేసుగుర్రం’, ‘బ్రూస్‌లీ’ వంటి భారీ చిత్రాలకు ఫొటోగ్రఫి చేసిన మనోజ్‌ పరమహంస ఈ చిత్రానికి డైరెక్టర్‌ ఆఫ్‌ పొటోగ్రఫిగా వర్క్‌ చేస్తున్నారు.
హాలీవుడ్‌ చిత్రాలకు ధీటుగా యాక్షన్‌ సీక్వెన్సెస్‌ని బల్గేరియాకు చెందిన యాక్షన్‌ డైరెక్టర్‌ కలోయాన్‌, ఎన్నో హిట్‌ చిత్రాలకు ఫైట్స్‌ కంపోజ్‌చేసిన రవివర్మ, రామ్‌లక్ష్మణ్‌, సెల్వ ఈ చిత్రంలోని ఫైట్స్‌ని థ్రిల్లింగ్‌గా తెరకెక్కించారు. ముఖ్యంగా బెల్జియంలో కోట్లాది రూపాయల వ్యయంతో చిత్రీకరించిన ఛేజ్‌, ఫైట్‌ ఈ చిత్రంలో స్పెషల్‌ హైలైట్స్‌ అవుతాయి. ఈ చిత్రంలోని అన్ని పాటల్ని ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్‌’వంటి భారీ చిత్రాలకు పాటలు రాసిన రామజోగయ్యశాస్త్రి రాశారు. ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు వర్క్‌చేసిన నారాయణరెడ్డి కళా దర్శకత్వం వహిస్తున్నారు. హేమాహేమీలైన సాంకేతిక నిపుణులతో హై టెక్నికల్‌వాల్యూస్‌తో ‘జాగ్వార్‌’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకునేలా ఏ విషయంలోనూ కాంప్రమైజ్‌ అవకుండా హెచ్‌.డి. కుమారస్వామి నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ సెవన్‌ ఏకర్స్‌లో వేస్తున్న భారీ సెట్స్‌లో జరిగే షెడ్యూల్‌తో నిర్మాణం పూర్తి చేసుకునే ‘జాగ్వార్‌’ చిత్రం 2016లో వచ్చే సినిమాల్లో ఓ సెన్సేషన్‌ హిట్‌గా నిలుస్తుంది. 
నిఖిల్‌కుమార్‌, దీప్తి హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు ఓ విలక్షణమైన పాత్ర పోషిస్తున్నారు. ఓ ప్రత్యేక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోంది. బ్రహ్మానందం, రఘుబాబు, సంపత్‌, ఆదిత్యమీనన్‌, సుప్రీత్‌, రవికాలే ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 
కథ: విజయేంద్రప్రసాద్‌, ఫొటోగ్రఫి: మనోజ్‌ పరమహంస, సంగీతం: యస్‌.యస్‌. థమన్‌, సమర్పణ: హెచ్‌.డి. కుమారస్వామి, నిర్మాత: శ్రీమతి అనితా కుమారస్వామి, స్క్రీన్‌ప్లే- మాటలు- దర్శకత్వం: ఎ.మహదేవ్‌

పెళ్లి చూపులు.. రివ్యూ

pelli chupulu review
టైటిల్ : పెళ్లి చూపులు (2016)
నటీనటులు : విజయ్ దేవర కొండ, రీతూ వర్మ
సంగీతం : వివేక్ సాగర్
దర్శకత్వం : తరుణ్ భాస్కర్
నిర్మాత : రాజ్ కందుకూరి, యాష్ రంగినేని
విడుదల తేదీ : 29 జూలై, 2016

ఓ వ్యక్తి.. వ్యక్తిగత జీవితంలో కీలక ఘట్టం పెళ్లి. అయితే, పెళ్లికి ముందు జరిగే పెళ్లిచూపులు భలే థ్రిల్లింగ్ గా ఉంటాయి. ఓ వైపు టెన్షన్మరోవైపు జీవిత భాగస్వామి చూడబోతున్నామన్న ఆతృత..  మొత్తానికి పెళ్లిచూపుల ఏపీసోడ్ పెళ్లి ఘట్టంలోనే హైలైట్ నిలిచిపోవడం ఖాయం. ఇక, ఈ తరం పెళ్లి చూపుల గురించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడీదే టైటిల్ తో.. ఓ సినిమాని మన ముందుకు తీసుకొచ్చాడు కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్. విజయ్ దేవర కొండరీతూ వర్మ జంటగా నటించారు. సంగీతం వివేక్ సాగర్. ఈ చిత్రాన్ని రాజ్ కందుకూరి, యాష్ రంగినేని నిర్మించారు. ఈ చిత్రం ఈ శుక్రవారం (జులై29) ప్రేక్షకుల ముందుకు రానుంది. కాకపోతే.. యూఎస్ లో ఇప్పటికే బినిఫిట్ షోలు పడిపోయాయి. ఓ స్పెషల్ ప్రివ్యూ చూశాక ఈ సమీక్షను మీకందిస్తున్నాం.

కొత్త దర్శకుడు, నటీనటులు కూడా దాదాపు కొత్తవారే. హీరో విజయ్ దేవరకొండ మాత్రం ఇది రెండో సినిమా. (ఇంతకు ముందు నాని “ఎవడే సుబ్రమణ్యం” సినిమాలో నాని ఫ్రెండ్ గా నటించాడు) టైటిల్ “పెళ్లి చూపులు” సాంప్రదాయం కలిగినది. అయితే, నేటి తరం పెళ్లి చూపులుజరిగే విధానాన్ని, నేటి యువత ఆలోచనల విధానాన్ని వినియోగించుకొని దర్శకుడు మ్యాజిక్ చేసే ఛాన్సుంది. వాస్తవికతకు దూరం కాకుండా, ఈతరం ఆలోచనలను అందరికీ కనెక్ట్ అయ్యేలా ఎంటర్‌టైనింగ్‌ చెప్పగలిగితే పెళ్లి చూపులుహిట్టయినట్టే. మరి.. దర్శకుడు ఏం చేశాడు. పెళ్లి చూపులంటూ.. ప్రాణం తీశాడా.. ? లేదా పెళ్లి చూపులు కొత్తగా ఉన్నాయ్ అనిపించాడా.. ? ఇంతకీ కథేంటీ.. ?? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళదాం పదండీ..

కథ :

ఈతరం ఆలోచనలున్న కుర్రాడు ప్రశాంత్ (విజయ్ దేవరకొండ). పెద్దగా లక్ష్యాలేమీ లేవన్నట్టు సరదాగా గడిపేస్తుంటాడు. కాకపోతే.. ఓ చెఫ్‌గా పనిచేయాలన్నది మనోడి కోరిక. అందరి ఇల్లలాగే..  ఇలా జీవితానికో లక్ష్యం లేకుండా తిరిగే కొడుక్కి పెళ్లిచేస్తే తిక్క కుదురితుంది. ఓ దారిలోకి వచ్చేస్తాడని ప్రశాంత్ తల్లిదండ్రులు ఫిక్సయిపోతారు. ఫాస్ట్ గా  చిత్ర (రీతూ వర్మ) అనే అమ్మాయితో పెళ్ళి నిశ్చయిస్తాడు కూడా. చిత్ర మాత్రం మనోడి టైప్ కాదు. ఓ లక్ష్యంతో పనిచేస్తోంది. ఫుడ్ ట్రక్ బిజినెస్ పెట్టాలన్నది ఆమె కల. అందుకే ప్రశాంత్ తో పెళ్లికి నో చెపేస్తోంది. ఈమె పోతో ఇంకో అమ్మాయి టైపులో.. ప్రశాంత్ కి పెళ్లి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో ఉద్యోగం, సద్యోగం లేని ప్రశాంత్ కి అమ్మాయి వాళ్ల తరుపు నుంచి సవాళ్లు ఎదురవుతూనే  ఉంటాయి. ఇలా ఓ వైపు పెళ్లి చూపుల ప్రయత్నాలు కొనసాగుతుండగానే.. మరోవైపు చిత్రతో కలసి మనోడు ఫుడ్ ట్రక్ బిజినెస్మొదలుపెడతాడు. రెండు వేర్వేరు ఆలోచనలున్న ఈ ఇద్దరు ప్రయాణం ఏమలుపు తిరిగింది ? వీరి కథ చివరికి ఏ తీరం చేరింది.. ?? అనేది మిగితా కథ. సింపుల్ గా చెప్పాలంటే.. ఫస్ట్ పెళ్లి చూపులు చూసిన అమ్మాయి… కాలంతో పాటుగా అనేక మలుపులు అనంతరం పెళ్లి పీటలు ఎక్కిందా.. ? లేదా.. ?? అనేది స్టోరి.

ప్లస్ పాయింట్స్ :
* కథ
* డైరెక్షన్
* హీరో-హీరోయిన్
* కొత్తదనం
* ఫస్టాఫ్
* సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :
* సెకండాఫ్‌ స్లో-నేరేషన్
* ట్విస్టులు లేకపోవడం (కథ ముందే తెలిసిపోవడం)

పెర్ ఫామెన్స్ :
పెళ్లి చూపులుకి పెద్ద హీరో దర్శకుడు తరుణ్ భాస్కర్. రచయిత, దర్శకుడిగా ఫుల్ మార్కులు కొట్టేశాడు. ఈ తరం జనరేషన్ కి ఏం చెబితే ఎక్కుతుంది.. ఎట్లా చెబితే వర్కవుట్ అవుతుందో.. సరిగ్గా దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేశాడు. ఎక్కడా అతి గానీ, ఎక్కడా వెతీ గానీ కనిపించకుండా జాగ్రత్తపడ్డాడు. ఆయన రాత-తీత రెండు బాగున్నాయి. సెకాండాఫ్ లో సినిమా కాస్త స్లో నేరేషన్ అనిపిస్తోంది. అదొక్కటే లేకుంటే పెళ్లి చూపులు స్థాయి మరోలా ఉండేది. దర్శకుడి తర్వాత సినిమాని నిలబెట్టింది కథానాయకుడు విజయ్ దేవర కొండ. ఈ తరం కుర్రాడి పాత్రలో ఒదిగిపోయి నటించేశాడు. విజయ్-రీతూ వర్మ కెమెస్ట్రీ తెరపై చాలా బాగుంది. ఎమోషన్స్ కనెక్ట్ అవ్వడానికి వాళ్ల మధ్య కెమెస్ట్రీ బాగా ఉపయోగపడింది. రీతూ వర్మ అందంగా సహజంగా నటించేసింది. ఇక మిగతా నటీనటులు కూడా బాగా నటించారు. ఒక్కటీ కూడా పనికిరాని పాత్ర అని అనిపించదు.

సాంకేతిక విభాగం :
 ‘పెళ్లి చూపులుసాంకేతికంగానూ రిచ్ గా ఉంది. తెరపై కొత్తదనం ఉట్టిపడేలా కనిపిస్తోంది. సినిమాటోగ్రఫీ బాగుంది. తక్కువ బడ్జెట్ చిత్రమే అయినా.. స్థాయి విజువల్స్ చాలా బాగొచ్చాయి. ఈ విషయంలో దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ఈ మూడు విభాగాల సమన్వయం అద్భుతంగా ఉంది. వివేక్ సాగర్ సంగీతం హాయిగా ఉంది. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని మరింత పెంచింది. అన్ని విభాగాలూ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాయి. ఈ తరం కుర్రాళ్లకి ఆలోచకి, ఆశలకి తగ్గట్టుగా ఈ సినిమా రిచ్ గా వచ్చింది. ఈ విషయంలో నిర్మాతలని మెచ్చుకోవాల్సింది.

చివరగా.. :
యూత్ ఫుల్ సినిమాని చూడ్డానికి ఫ్యామిలీ ఆడియెన్స్ కాస్త ఇబ్బంది పడుతుంటారు అనే టాక్ ఉంటుంది. కానీ.. పెళ్లి చూపులువిషయంలో అలాకాదు. ఇది యూత్ ఫుల్ ఫిల్మ్. అదేసమయంలో తల్లిదండ్రులతో కలసి ఏంచక్కా పెళ్లి చూపులు చూడొచ్చు. యువత ఆలోచనలను ఎలాఉంటాయని మాత్రమే చూపించారు. కానీ.. అదే పేరుతో అశ్లీలానికి ఏమాత్రం తావులేదు. కొత్తదనాన్ని కోరుకునే వారు తప్పకుండా  ‘పెళ్లి చూపులుథియేటర్స్ వైపు పరుగులు పెట్టొచ్చు.

బాటమ్ లైన్ : పెళ్లి చూపులు.. కొత్తగా ఉన్నాయ్.. !
రేటింగ్ : 3.25/5

—  vittu
– 9603632666

 

 

 

 

జనతా గ్యారేజ్ కి రిపేర్లు అవసరం లేదు…

janatha garage ntr koratala siva mohan lal

ఎన్టీఆర్-కొరటాల శివ ‘జనతా గ్యారేజ్’ సినిమా ముగింపు దశకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరందుకున్నాయి. అందులో భాగంగానే డబ్బింగ్ పనులు కూడా ప్రారంభమైపోయాయి. అయితే డబ్బింగ్ విషయంలో మోహన్ లాల్ కి .. కొరటాలకి మనస్పర్థలు వచ్చాయనే వార్త వినిపిస్తోంది. డబ్బింగ్ పనులు నిలిచిపోయాయని కూడా చెప్పుకుంటున్నారు.

ఈ విషయంపై స్పందించిన జనతా గ్యారేజ్ టీమ్.. అలాంటిదేం జరగలేదనీ, ఇదంతా పుకారే అని అంటోంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా సినిమా పనులన్నీ సవ్యంగా జరిగిపోతున్నాయని స్పష్టం చేస్తోంది. ఎన్టీఆర్ సరసన సమంతా .. నిత్యామేనన్‌లు నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అఖిల్ రెండు హను మూడు…

akhil second movie director hanu

అఖిల్ రెండవ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా అనే ఆసక్తితో అక్కినేని అభిమానులు వున్నారు. ఇదిలా ఉంటే, అఖిల్ సెకండ్ పిక్చర్‌ డైరక్టర్‌పై ఎంతోమంది పేర్లు వినిపించాయి. ఆ జాబితాలో హను రాఘవపూడి కూడా ఉన్నాడు. అతని దర్శకత్వంలోనే అఖిల్ రెండవ సినిమా చేయనున్నాడనేది లేటెస్ట్ న్యూస్.

సెకండ్ మూవీపై అఖిల్ ట్విట్టర్‌లో స్పందించాడు. తన రెండవ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్‌ను మరింతగా వెయిట్ చేయించడం ఇష్టం లేదన్న అఖిల్ తన రెండవ సినిమాను హను రాఘవపూడి తెరకెక్కిస్తాడని చెప్పాడు. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయని… త్వరలో షూటింగ్ మొదలుపెడతామని తెలిపాడు. అఖిల్ స్వయంగా స్పందించడంతో ఆయన నెక్స్ట్ పిక్చర్‌పై ఓ క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర నటవర్గం వివరాలను చిత్రబృందం త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

అమ్మకానికి పవన్ కారు..

pawan sold benz car

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ గురించిన వార్త ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఆయన తన బెంజ్‌ కార్ అమ్మేశారని చెప్పుకుంటున్నారు. తన దగ్గర ఉండే మెర్సిడెస్ బెంజ్ జి55 మోడల్‌ను పవన్ అమ్మినట్లు వార్తలొస్తున్నాయి. ఈ కారు మోడల్‌ను ఎప్పుడో నిలిపివేసింది బెంజ్ కంపెనీ. అప్పట్లో రూ.1.5 నుంచి రూ.2 కోట్లు ధర ఉన్న ఈ కారు ఇప్పుడు అమ్మితే రూ.80లక్షలు కూడా రాకపోవచ్చని వినికిడి. కాకపోతే పవన్ వాడారు కాబట్టి రూ.1 కోటి వరకు చేతికంది ఉండొచ్చు.

అసలు పవన్ ఈ కార్‌ ఎందుకు అమ్మేశారో తెలీడంలేదు. ఆర్ధిక సమస్యలున్నాయని గతంలో పలుమార్లు చెప్పినా.. కార్లు అమ్ముకునేంతటి పరిస్థితైతే ఆయనకు లేదు. దీంతో పవర్‌స్టార్ కొత్త కారు కొనుక్కోవడానికి పాత వాహనం అమ్మి ఉండొచ్చని కొందరు అంటున్నారు.