కానిస్టేబుల్ భౌతిక కాయం మోసిన సీఎం ..

 Posted November 1, 2016

mp cm shivraj singh visits martyr ramashankar yadav's residence
జైలు నుంచి పారిపోతున్న సిమి ఉగ్రవాదుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన హెడ్ కానిస్టేబుల్ రమాశంకర్ యాదవ్ కి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజసింగ్ చౌహాన్ ఘన నివాళి అర్పించారు. స్వయంగా అంతిమయాత్రలో పాల్గొన్న చౌహాన్ కానిస్టేబుల్ భౌతికకాయాన్ని కొంతసేపు మోశారు. సిమి ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన యాదవ్ కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్ట పరిహారం తో పాటు.అయన కుమార్తె వివాహానికి 5 లక్షల సాయం చేస్తామని హామీ ఇచ్చారు.రమా శంకర్ కుటుంబం ఉంటున్న కాలనీకి అయన పేరు పెట్టాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు.

భోపాల్ సెంట్రల్ జైలు నుంచి 8 మంది సిమి ఉగ్రవాదులు తప్పించుకెళుతూ విధుల్లో వున్న రమా శంకర్ ని పొట్టనబెట్టుకున్నారు.అయితే ఓ గంట వ్యవధిలోనే వారిని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మట్టుబెట్టారు.దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటన పై కేంద్ర హోమ్ శాఖ మంత్రి కూడా ఆరా తీసిన విషయం తెలిసిందే..

Encounter of 8 SIMI Suspects Genuine

SHARE