ఆ ఎంపీ చిందులు ఎందుకో?

0
429

 mp dance why
డాక్టర్ శివ ప్రసాద్, ఎంపీ ..పేరు ముందు చదువుకున్న డాక్టర్ పట్టా ..పేరు వెనుక జనం ఎన్నుకున్న హోదా ..ఈ రెంటికి సెట్ కాకుండా ఉంటుంది అయన ప్రవర్తన .నాటక,సినీ రంగం నుంచి వచ్చిన అయన మీద వాటి ప్రభావమే ఎక్కువగా కనిపిస్తుంటుంది.

సమైక్యాంధ్ర మొదలుకొని ఇప్పటి ప్రత్యేక హోదా ఉద్యమం దాకా శివప్రసాద్ వేసిన వేషాలు అన్నీఇన్నీ కావు .ఆ ప్రత్యేక వేషధారణ వల్ల సమస్య త్వరగా జనాల్లోకి వెళ్తుందని అయన నమ్ముతారు.ఇటీవలే నమో నారాయణాయ మంత్రానికి కొత్త అర్ధం చెప్పి ప్రధాని మోడీని నవ్వించిన శివప్రసాద్ తాజాగా పార్లమెంట్ లో తప్పెటగుళ్లు ఆడారు . అయన వేసిన చిందులేమోగానీ వేషధారణ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది . ఇంతకీ శివప్రసాద్ తప్పెటగుళ్లు ఎందుకాడారో అర్ధమైందిగా ..ఆంధ్రకు ప్రత్యేక హోదా కోసం …

siva prasad 2 (2)

Leave a Reply