Posted [relativedate]
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై టిఆర్ఎస్ స్పందన ఆసక్తికరంగా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె, నిజామాబాద్ లోక్ సభ సభ్యురాలు కవిత మాట్లాడుతూ ఏపీలో ప్రత్యేక హోదా డిమాండ్ కు తాము కూడా మద్దతు ఇస్తామని అన్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవలసిన బాద్యత ఆయా పార్టీలపై ఉంటుందని ఆమె అన్నారు. ఏపీకి మద్దతు ఇవ్వాలని తాము కూడా కోరుతున్నామని ఆమె చెప్పారు. ఏపీలో అదికార తెలుగుదేశం పార్టీ నేతలు తమకు ప్రత్యేక హోదా అవసరం లేదని చెబుతున్న తరుణంలో పొరుగు రాష్ట్రానికి చెందిన ఎమ్.పి కవిత ప్రత్యేక హోదాకు మద్దతు ఇవ్వడం విశేషఃం