Monday, March 27, 2023
Homelatestపెళ్ళికి ముందే ఎమ్మెల్యే మామని వంచిన ఎంపీ అల్లుడు?

పెళ్ళికి ముందే ఎమ్మెల్యే మామని వంచిన ఎంపీ అల్లుడు?

క్యాబినెట్ విస్తరణ జరిగినప్పటినుంచి అలకతో వున్న టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి ఎట్టకేలకు దిగివచ్చారు.అజ్ఞాతంలో వున్న బండారు కనీసం ఓదారుద్దామని ప్రయత్నించిన నాయకులకు కూడా అందుబాటులో లేకుండా పోయారు.అలాంటిది ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ వైసీపీ అధినేత జగన్ ని కడిగి పారేశారు.లోకేష్ కి మద్దతుగా మాట్లాడారు.అవినీతి కేసులతో నిండా మునిగిన జగన్ ఒక్క కేసులో కూడా ప్రమేయం లేని లోకేష్ ని తప్పుబట్టడమా అని చీల్చి చెండాడారు. బండారు లో ఈ మార్పు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.ఒకదశలో పార్టీ వదిలిపోవాలనుకున్న వ్యక్తి,హైకమాండ్ ఎంత ప్రయత్నించినా సర్దుబాటుపై ఓకే చెప్పని బండారు ఇలా ఎలా మారాడా అని ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు వెలుగుజూశాయి.

ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కుమార్తె ని ఎంపీ రామ్మోహన్ నాయుడు వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే.ఆ పెళ్లి ఏర్పాట్లలో బిజీగా వున్న సత్యనారాయణమూర్తి కి సాక్షాత్తు కాబోయే అల్లుడు,ఎంపీ రామ్మోహన్ నాయుడు అసంతృప్తి తగదని బుజ్జగించారట.సరే అన్న మామకి మహానాడులో పార్టీ అధినేత చంద్రబాబు ఇంకో స్వీట్ షాక్ ఇచ్చారు.రామ్మోహన్ వ్యవహారశైలిని పొగిడిన బాబు అతనికి ఉజ్జ్వల భవిష్యత్ ఉంటుందని సభావేదిక మీదే చెప్పడంతో బండారు ఖుష్ అయిపోయారట.ఏదో రోజు రామ్మోహన్ నాయుడు టీడీపీ లో ఉన్నతంగా ఎదుగుతాడన్న నమ్మకంతో బండారు సంతోషపడటమే కాకుండా తన అలక వీడి పార్టీ కోసం పని చేయడానికి సిద్ధం అయ్యారట. ఎంతైనా పెళ్ళికి ముందే మామని వంచిన ఘనత ఎంపీ రామ్మోహన్ నాయుడుకి దక్కుతుంది.

- Advertisment -
spot_img

Most Popular