ఆంధ్రాకి డబ్బా పాలే దిక్కా ?

mp sivaprasad comments
ఆంధ్రప్రదేశ్ విభజనకి సంబంధించి ఎన్నెన్ని వ్యాఖ్యానాలు? నాడు ఆంధ్రాని ఆదుకుంటామని చెప్పడానికి వచ్చిన మోడీ …పిల్లని బతికించి తల్లిని చంపుతారా అని ప్రశ్నించారు.ఆ తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకోనప్పుడు అవే పలుకులు ప్రత్యర్థులకు అస్త్రాలయ్యాయి.ఇప్పుడు కాస్త అటుఇటుగా అదే మాటలతో ముందుకొచ్చారు చిత్తూరు ఎంపీ ఎన్.శివప్రసాద్ .హోదా,విభజన పోరాట సమయంలో విభిన్న వేషధారణలతో అందరి దృష్టిని ఆకర్షించిన అయన ఇప్పుడు ప్యాకేజ్ పై వెరైటీ వ్యాఖ్యలు చేశారు.

ఓ వైపు పాలకోసం బిడ్డ ఏడుస్తోంది..మరోవైపు పాలివ్వలేక తల్లి కూడా ఏడుస్తోంది.ఈ సమయంలో బిడ్డకి పొడితో చేసిన పాలు పట్టక తప్పుతుందా అని శివప్రసాద్ వ్యాఖ్యానించారు.అయన మాటల్లో తల్లిపాలంటే హోదా అని,పొడితో చేసిన పాలంటే ప్యాకేజ్ అని అర్ధం.ఏమైనా ఆయన వేషం అర్ధమైనంత తేలిగ్గా భాష అర్ధం కావడంలేదు.

SHARE