ఎమ్.ఎస్ ధోని మూవీ రివ్యూ…

  ms dhoni movie review

చిత్రం : ఎమ్.ఎస్ ధోని (2016)
నటీనటులు : సుశాంత్ రాజ్ పుత్,అనుపమ్ కౌర్, భూమిక చావ్లా, కైరా అడ్వానీ,  దిశా పాటాని

భారత క్రికెట్ చరిత్రలో తనదైన ముద్రవేసిన క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని. భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించిన కెప్టెన్లలో.. కూల్ కెప్టెన్ ధోని పేరొందాడు. ఎలాంటి టైంలోనూ టెంట్ కాకపోవడం ధోని ప్రత్యేకత. అదే ధోనికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఆ సహనం.. ఆ చతురత టీం-ఇండియాని వన్ డే, టెస్ట్ మ్యాచ్ లోనూ నెం.1ని చేసింది. అలాంటి ధోని జీవితం గాథ ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కుతోంది అంటే.. సాధారణంగానే భారీ అంచనాలు నెలకొనడం సహజం. ధోని బయోపిక్.. “ఎమ్.ఎస్ ధోని” చిత్రంపై అలాంటి అంచనాలే నెలకొన్నాయి. పైగా స్వయంగా ధోని నే ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగం పంచుకోవడంతో అంచనాలు ఆకాశనంటాయి. భారీ అంచనాల మధ్య తెరపై ‘ఎమ్. ఎస్ ధోని’ ఇన్నింగ్స్ మొదలైంది. మరి.. జీవిత గాథతో ధోని మ్యాచ్ ని గెలిపించాడా.. ? అది ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది… తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ..

నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కిన ధోని బయోఫిక్ లో ధోని గా సుశాంత్ రాజ్ పుత్ నటించారు. అనుపమ్ కౌర్, భూమిక చావ్లా, కైరా అడ్వానీ,  దిశా
పాటాని కీలక పాత్రలో నటించారు. అరుణ్ పాండే నిర్మాత. తెలుగు, తమిళ్, హిందీ, మరాఠీ బాషాలో ధోని బయోపిక్ రిలీజైంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు
60దేశాల్లో 4500+ థియేటర్స్ లో ధోని బయోపిక్ రిలీజైంది. ఈ చిత్ర రన్ టైం 3గం. 10ని॥.

కథ :
ధోని జీవితమే ఈ చిత్ర కథ. రాంచీలో మొదలైన ధోని జీవితం.. భారత్ క్రికెట్ లో సభ్యుడిగా ఎలా స్థానం సంపాదించాడు. ఈ క్రమంలో ధోని అనుభవించిన ఉత్కంఠ క్షణాలు. రైల్వే టికెట్ కలెక్టర్ అయిన ధోని.. మళ్లీ తన లక్ష్యం వైపు ఎలా అడుగులు వేశాడు. టికెట్ కలెక్టర్ జీవితం ధోనికి ఏం నేర్పింది. ధోని కెరీర్ లో ఎదురైన సమస్యలెంటీ.. ? ధోని ప్రేమకథ.. కెరిర్ లో ధోని ఏం సాధించాడు. ప్రస్తుతం ధోని ఏ పొజిషన్ లో ఉన్నాడన్నది.. కథ.

ప్లస్ పాయింట్స్ :
* సుశాంత్ సింగ్ రాజ్ పుత్
* డైరెక్షన్
* మ్యూజిక్
* సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :
* కొన్ని ఇబ్బంది కలిగించే సీన్స్

నటీనటుల ఫర్ ఫామెన్స్ :
ధోనిగా నటించిన సుశాంత్ రాజ్ పుత్ ఇరగదీశాదు. తెరపై నిజంగానే ధోనిని చూసినట్టు నటించాడు. ధోని మేనరిజం ఉన్నది ఉన్నట్టుగా దించేశాడు. ప్రతి
సీన్ లోనూ ఒదిగిపోయాడు. సుశాంత్ నటనకి ఎన్నో అవార్డులు వచ్చి పడటం ఖాయం. మొత్తంగా ధోని పాత్రలో సుశాంత్ తప్ప మరెవ్వరిని ఊహించలేము. అంతలా ఆకట్టుక్కొన్నాడు సుశాంత్. సుశాంత్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఇక, ధోని తండ్రిగా నటించిన అనుపమ్ కౌర్ చాలా బాగా చేశారు. చాలా రోజుల తర్వాత తెరపై కనిపించిన భూమిక చావ్లా నటనతో ఆకట్టుకొంది. ధోని లవ్వర్
(సాక్ష ధోని) గా  నటించిన కైరా అడ్వానీ నటన సూపర్భ్. ఇక, ధోని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా నటించిన దిశాపటాని బాగా చేసింది. మిగిలిన కథలకి చిత్రంలో పెద్దగా ప్రాధాన్యత లేదు.

ధోని-సాక్షి (కైరా అడ్వానీ) మధ్య లవ్ ఏపీసోడ్ రొమాటిక్ గా తెరకెక్కించాడు దర్శకుడు. ధోనిలోని రొమాటింక్ యాంగిల్ ప్రేక్షకులని కాస్త షాక్ కి గురి చేయడం ఖాయం.

సాంకేతికంగా :
ఎమ్. ఎస్ ధోని చిత్రం టెక్నికల్ టీం ని కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. టెక్నికల్ టీం.. టీంవర్క్ తెరపై స్పష్టంగా కనిపిస్తోంది. ముందుగా దర్శకుడు నిరాజ్ పాండ్ కి పెద్ద హ్యాండాఫ్. ధోని జీవితంలో చాలా మందికి తెలియని విషయాలని తెరపైకి తీసుకొచ్చాడు. వీటి గురించి సినిమా చూసిన ప్రేక్షకులు మళ్లీ చర్చించుకోవడం ఖాయం. సంగీతం చాలా బాగుంది. ఎడిటింగ్  ఫర్వాలేదు. సినిమాటోగ్రఫీ సూపర్భ్. నివిడి పరంగా ధోని బయోపిక్ చాలా పెద్దది. 3గం॥10ని॥ల పాటు ప్రేక్షకుడి బోర్ కొట్టకుండా చూడటంలో చిత్రబృందం సక్సెస్ అయ్యింది.

తెలుగు బుల్లెట్ అనాలసిస్ :
క్రికెట్ ప్రేమికులు ఎమ్.ఎస్ ధోని జీవితం గురించి అన్ని తెలుసని అనుకుంటారు. కానీ.. క్రికెట్ ప్రేమికులకు కూడా తెలియని చాలా విషయాలు ధోని జీవితంలో ఉన్నాయి. అవెంటో తెలుసుకోవాలంటే.. ధోని బయోపిక్ చూడాల్సిందే..!!

బాటమ్ లైన్ : ‘ఎమ్.ఎస్ ధోని’.. తెరపై కూడా గెలిచాడు
రేటింగ్ : 3.5/5

SHARE