ధోని మెచ్చిన ధోని…

0
393

  ms dhoni praise dhoni movie‘ఎం.ఎస్‌.ధోనీ- ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ సినిమా కోసం సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చాలా కష్టపడ్డాడు. కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్ ధోనీలా కనిపించేందుకు భారీ కసరత్తులే చేశాడు. రాజ్‌పూత్‌ కష్టం తనను ఆశ్చర్యపరచిందని చెబుతున్నాడు క్రికెటర్‌ ధోనీ. ధోనీ జీవితం ఆధారంగానే ‘ఎం.ఎస్‌. ధోనీ’ చిత్రం తెరకెక్కింది. తన పాత్రలో నటించిన సుశాంత్‌ గురించి ధోనీ మాట్లాడుతూ ‘‘సుశాంత్‌ నిజంగా చాలా కష్టపడ్డాడు.

రోజూ 9గంటలు ప్రాక్టీస్‌ చేసేవాడు. మూడు గంటలకు పైగా బ్యాటింగ్‌ చేస్తూ.. నాలా షాట్స్‌ కొట్టాలని ట్రైచేశేవాడు. జట్టు గెలిచినప్పుడు.. ఓడినప్పుడు నా మైండ్‌ ఎలా ఉండేదో అర్థం చేసుకున్నాడు. నా నడక.. నేను మాట్లాడే విధానం.. ఇలా ప్రతీ చిన్న విషయాన్ని అనుకరించాడు. ఇవన్నీ చేసిన సుశాంత్‌ను చూస్తే.. నాకే ఆశ్చర్యమేసింది’’ అని అన్నాడు ధోనీ. ధోనీ నుంచే మంచి కితాబు అందుకున్న రాజ్‌పూత్ తెరపైనా దుమ్ము రేపుతాడని చిత్రబృందం అంటోంది.

Leave a Reply