ధోని200.. నాటౌట్ !

0
459

 Posted [relativedate]

ms-dhoni-movie-collected-200-crsటీమిండియా కెప్టెన్ ఎం.ఎస్ ధోని ఇరగదీస్తున్నాడు. డబుల్ సెంచరీ కూడా పూర్తి చేశాడు. ఇది గ్రౌండ్ లో కాదు.. వెండితెరపైనా. ధోని బయోపిక్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘ఎంఎస్ ధోనీ : ద అన్ టోల్డ్ స్టోరీ’
బాక్సాఫీస్ దగ్గర హవా కొనసాగిస్తూనే ఉంది. తాజాగా, ధోని బయోపిక్ వసూళ్లు రూ.200కోట్ల మార్క్ ని చేరుకొన్నాయి. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు వెల్లడించారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 204 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించినట్టు తెలిపారు.

ఫస్ట్ డే వసూళ్లతోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా ధోని బయోపిక్ రికార్డ్ సాధించింది. సల్మాన్ ‘సుల్తాన్’ తర్వాత ఫస్ట్ డే అత్యధికంగా వసూలు చేసిన బయోపిక్ గా ఎం.ఎస్ ధోని నిలిచాడు. మొత్తంగా చూస్తే.. భారత్ లో 175.7 కోట్లు, విదేశాల్లో 29 కోట్ల వసూలు చేసింది. సెప్టెంబర్‌ 30న విడుదలైన ధోని.. ఇంకా వసూళ్లు నిలకడగానే ఉన్నాయని నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కిన ధోని బయోపిక్ లో ధోనిగా సుశాంత్ రాజ్పుత్ నటించారు. దిశాపటాని, భూమిక, అనుపమ్ కేర్ ప్రధాన పాత్రలో కనిపించారు. అరుణ్ పాండే నిర్మాత.

Leave a Reply