బాబుని జ్యోతిబసు అంతంటున్న ముద్రగడ..

Posted February 6, 2017

mudragada comparing chandrababu with jyothibasu
ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుని కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ తిడితే పెద్ద వార్తేముంది? కానీ ఆయన పొగిడితే మాత్రం వార్తే.ఇప్పుడు అదే జరిగింది.బాబు సర్కార్ మీద యుద్ధం చేస్తున్న ముద్రగడ నయానోభయానో కాపులకి రిజర్వేషన్ సాధించడానికి ప్రయత్నిస్తున్నారు.ఈ క్రమంలో సీఎం చంద్రబాబుని జ్యోతిబసు తర్వాత అంతటి అపార అనుభవం కలిగిన నాయకుడిగా అభివర్ణించారు.ఇలా పొగిడేసి జ్యోతిబసు అంత నాయకుడితో పోల్చినందుకన్నట్టు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని బాబుకి సూచించారు.

ఇలా పొగడ్తల పర్వంతో సీన్ ఆగిపోలేదు.బాబుని రఫ్ ఆడేశారు ముద్రగడ.తమ ఉద్యమం వెనుక వైసీపీ అధినేత జగన్ హస్తముందని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు,కాంగ్రెస్ నాయకుడు చలమలశెట్టి రమేష్ ఇళ్లలో కాపు నేతలతో సమావేశమయ్యాక ముద్రగడ ఈ వ్యాఖ్యలు చేయడంతో వాటి విలువని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు.అయితే ఇదేమీ పట్టించుకోకుండా బాలయ్య ఇంటిలో కాల్పుల కేసుకి సంబంధించి నెంబర్ లేని కారులో సెక్యూరిటీ కూడా లేకుండా వై.ఎస్ ఇంటికెళ్లి బాబు ఆయన కాళ్లుపట్టుకున్నారని ముద్రగడ మరోసారి ఆరోపణలు చేశారు.ఈ నెల 13 తో మంజునాథ కమిటీ పర్యటన ముగిశాక కాపు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ముద్రగడ ప్రకటించారు.

SHARE