రూట్ మార్చిన ముద్రగడ..దేవుడిపై రిజర్వేషన్ భారం

Posted [relativedate]

mudragada devotion to god for chandrababu want to giving kapu reservation
కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ముద్రగడ ఈసారి దేవుడిని నమ్ముకున్నారు.కొబ్బరికాయలు,పూజలతో బాబు మనసు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.ఆ విషయాల్లోకి లోతుగా వెళ్లే ముందు మరికొన్ని అంశాల మీద కూడా ముద్రగడ మాట్లాడారు . కులాల మధ్య చిచ్చు పెడుతున్నట్టు తన మీద వస్తున్న ఆరోపణల్ని ముద్రగడ కొట్టిపారేశారు.అదే కులం పేరు చెప్పి అది చేస్తాం ..ఇది చేస్తాం అని ఓట్లు వేయించుకున్నప్పుడు ఏమైందని ఆయన బాబుని నిలదీశారు.ఇక తనతో ఈ విషయం గురించి చర్చించేందుకు ఇద్దరు రాష్ట్ర మంత్రులు,ఓ పెద్ద మనిషి టచ్ లోకి వస్తున్నట్టు ముద్రగడ చెప్పుకున్నారు.గౌరవప్రదం గా ఆహ్వానిస్తే చర్చలకు సిద్ధమని ముద్రగడ వివరించారు.ఈసారి ఎలాగైనా కాపు రిజర్వేషన్ సాధిస్తానని చెప్పే ఆయన అందుకు దేవుడిని నమ్ముకున్నట్టున్నారు.

రేజర్వేషన్ల కోసం కాపు ,బలిజ యువత రాష్ట్రవ్యాప్తంగా గుడుల్లో కొబ్బరికాయలు కొట్టాలని ముద్రగడ పిలుపు ఇచ్చారు.కొబ్బరికాయలు కొట్టి దేవుడిని ఏమి కోరుకోవాలో కూడా ఆయనే సెలవిచ్చారు. కాపు రిజర్వేషన్ అంశంలో బాబు మనసు మార్చమని దేవుడిని కోరుకోవాలంట. దేవుడి మీద ఉద్యమ భారం వేయడం కోసం ఆయన స్వయంగా ఓ యాగం చేయబోతున్నట్టు వివరించారు.ఓ శివాలయంలో ఆయన ఈ యాగం చేస్తారు.అయితే బయటికి చెపితే ఆ గుడి పూజారిని అరెస్ట్ చేస్తారని ముద్రగడ సందేహం వ్యక్తం చేశారు.ఏదేమైనా ఉద్యమభారాన్ని దేవుడి మీద వేయడం సరికొత్త కోణమే .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here