‘ముద్ర’ గడ వాగ్బాణాలు

0
485

  mudragada feel about cm chandrababu workఅంతా అనుకున్నట్టే నిరాహార దీక్ష విరమించిన వెంటనే చంద్రబాబు సర్కార్ లక్ష్యంగా ముద్రగడ పద్మనాభం నోరు విప్పారు.దీక్ష సమయంలో పరిస్థితుల్ని వివరించారు.ఆస్పత్రిలో తనను అంతర్జాతీయ ఉగ్రవాదిగా చూశారని ఆక్రోశించారు.కనీసం పేపర్,టీవీ,సెల్ ఫోన్ ఏదీ అందుబాటులో లేకుండా చేశారన్నారు.తన కుటుంబ సభ్యుల్ని పోలీసులు బూతులు తిట్టారంటూ కన్నీరు పెట్టుకున్నారు.

అల్పుడనని, అనాధనాని వాపోయారు.శరీరం లో రక్తం,పౌరుషం,పట్టుదల బదులు సెలైన్ నీళ్ళే మిగిలాయని ఆవేదన చెందారు.ఇంత చేసిన వారికి భగవంతుడు శాస్తి చేసేదాకా తమ ఇంట్లో పండగలు జరుపుకోబోమని ప్రతిన బూనారు.ఇచ్చిన హామీ అమలు చేయమంటే సీఎం కి అంత కోపమెందుకోని ప్రశ్నించారు.ఎంత జరిగినా ఉద్యమాన్ని కొనసాగిస్తానని ముద్రగడ స్పష్టం చేశారు.

Leave a Reply