రావులపాలెం to అంతర్వేది ముద్రగడ పాదయాత్ర…

Posted October 14, 2016

  mudragada padayatra ravulapalem to antarvedi

కాపు ఉద్యమ నేత,మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మళ్లీ ఉద్యమం కార్యాచరణ కు సిద్దమయ్యారు..తాను ఐదు రోజుల పాటు సత్యాగ్రహ పాదయాత్ర చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.ఆగస్టు ఆఖరులోగా కాపుల రిజర్వేషన్ల హామీని నెరవేర్చుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారని, కాని అది అమలు కానందున తిరిగి తాను ఉద్యమ కార్యాచఱన ప్రకటిస్తున్నానని అన్నారు.తాను ఉద్యమం విరమించలేదని,కాపు జాతి కోసం తాను ఉద్యమిస్తానని అన్నారు.తనతో పాటు ఎవరైనా రావచ్చని,ఐదుగురు వచ్చినా ,ఎక్కువ మంది వచ్చినా పాదయాత్ర సాగుతుందని ఆయన అన్నారు.దీనిపై వెనుకడగు వేసే ప్రసక్తి లేదని ముద్రగడ అన్నారు.రావుల పాలెం నుంచి అంతర్వేదిలో దీనిని ముగిస్తామని ఆయన తెలిపారు.

SHARE