బాబు మీద బాలయ్య అస్త్రమా?

  mudragada padmanabham angry balayya revolver case
ముఖ్యమంత్రి చంద్రబాబుని టార్గెట్ చేస్తున్న ముద్రగడ బావమరిది అస్త్రం ప్రయోగిస్తున్నారు.తానెన్ని విమర్శలు చేస్తున్నా బాబు కౌంటర్ ఇవ్వకపోవడంతో ముద్రగడ ఇటీవల తరచుగా బాలయ్యని బాబు మీద ఉపయోగిస్తున్నారు.ఓ ఇంటర్వ్యూ లో బాలయ్య ఇంట్లో కాల్పుల అంశాన్ని ముద్రగడ ప్రస్తావించారు.అప్పట్లో ఆ కేసు నుంచి బావమరిదిని బయటపడేయడానికి బాబు రాత్రిపూట వై .ఎస్ ఇంటికెళ్లి అయన కాళ్ళు పట్టుకున్నారని ముద్రగడ తీవ్ర విమర్శలు చేశారు. ఆ వేడి తగ్గకముందే అదే విషయాన్ని ముద్రగడ మరోసారి ప్రస్తావించారు.

వియ్యంకుడిని రివాల్వర్ సరెండర్ చేయమని ఏపీ ప్రభుత్వం ఆదేశించడాన్ని ముద్రగడ తప్పుబట్టారు.పైగా నేనేమీ బాలయ్యలా ఆయుధం వాడనని ముద్రగడ చెప్పుకొచ్చారు. పదే పదే బాలయ్య ప్రస్తావన తెచ్చి బాబుని ఇరుకున పెట్టడానికి ముద్రగడ ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్ధం కావడం లేదు.కానీ దీని వెనుక ఏదో వ్యూహం ఉందని ముద్రగడ గురించి తెలిసినోళ్ల మాట .

SHARE