Posted [relativedate]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తప్పుబట్టడం కొత్త కాదు..అందులో వింత లేదు.అయితే ఈసారి ముద్రగడ విమర్శల్లో ఉలికిపాటు, మాటల్లో బేలతనం కనిపిస్తోంది.పైకి మాత్రం మారిన ముద్రగడని ఇక కాచుకో అంటూ బాబుకి సవాల్ విసిరినా లోగుట్టు ఏదో ఉందని తేలిపోయింది.సీఎం బాబుకి తాజాగా ముద్రగడ ఓ లేఖ రాశారు. ఆ లేఖ చదువుతుంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కళ్ల ముందు మెదలడం ఖాయం. వై.ఎస్ హయాంలో సర్కార్ కి వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతి భారీ కధనాలు ఇచ్చింది.వాటిని ఆపేందుకు వై.ఎస్ సామదానభేద దండోపాయాలు ప్రయోగించారు.వై.ఎస్ టీం తన గుట్టుమట్లు లాగుతోందన్న భయంతో “నేను సామాన్యుణ్ణి” అంటూ అప్పట్లో సొంత పత్రికలో తన జీవన ప్రస్థానాన్ని వివరించారు. చేసిన తప్పులు కొన్నిటిని ఒప్పుకున్నారు.ఆ ఒప్పుకోలుతో వై.ఎస్ టీం ముందర కాళ్ళకి బంధం వేశారు.పైగా రాధాకృష్ణ జీవితంలో అంతకు ముందు బయటి ప్రపంచానికి తెలియని విషయాలెన్నో వెలుగుజూశాయి.
ఇప్పుడు అదే టైపు లో ముద్రగడ బయటి ప్రపంచానికి తెలియని విషయాలు ప్రస్తావిస్తూ చంద్రబాబుకి లేఖ రాశారు.అందులో తన మీద ఓ పుస్తకం రాబోతున్న విషయాన్ని ప్రస్తావించిన ముద్రగడ..ఆ పని చేస్తున్న వారి మీద అబాండాలు వేసేసారు.అసలు వాళ్లెవరో పేర్లు చెప్పకుండా ఈ స్థాయిలో ముద్రగడ ఫైర్ కావడం,పాత విషయాలెన్నో తిరగదోడటం చూస్తుంటే ఆ పుస్తకం ముద్రగడని బాగానే భయపెడుతున్నట్టుంది.బయటికి రాకముందే ఆయన్ని ఇంతగా భయపెడుతున్న పుస్తకాన్ని ఎదుర్కోడానికి ముద్రగడ తాను విమర్శలు చేస్తున్న ఆర్కేని ఫాలో అయ్యి లేఖ రాయడం చిత్రమే.ఏమైనా ముద్రగడ లెటర్ తో రాబోయే పుస్తకం సంచలనం రేపడం ఖాయమనిపిస్తోంది. ఆ పుస్తకం కేంద్రంగా ముద్రగడ రాసిన లేఖ మీ కోసం..