ముద్రగడకి షాక్ ..రంగంలోకి ఇతర కాపు నేతలు

Posted September 28, 2016

  mudragada shocked kapu meeting

కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని వైసీపీ చేతిలో ఆట బొమ్మగా మార్చిన ముద్రగడ మీద కాపు పెద్దలు రగిలిపోతున్నారంట.ముద్రగడ వ్యవహారశైలి తో కాపులకి నష్టం జరుగుతుందని భావించిన నేతలంతా ఇటీవల ఓ రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారట.అందులో ముద్రగడ మీద తీవ్ర అసహనం ఎదురయ్యిందట. వైసీపీ ఆడమన్నట్టల్లా ఆడుతున్న ముద్రగడని నిలవరించకపోతే కాపులకి ద్రోహం చేసినవాళ్ళం అవుతామన్న అభిప్రాయం వ్యక్తమైందట.ఇదంతా చూస్తూ ఉండటం కన్నా గొంతెత్తి పోరాడడం మేలని ఓ నిర్ణయం తీసుకున్నారు.

ముద్రగడ వైఖరితో విసిగిపోయిన కాపు నేతలు ఓ వ్యక్తి ఉమ్మడి కార్యాచరణ కి ఓకే చెప్పారు. ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించాలని నిర్ణయించారు.కాపుల కోసం పార్టీలకి అతీతంగా ఎప్పటినుంచో పోరాడుతున్న పిళ్లా వెంకటేశ్వరరావు వంటి నేతలతో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర లేదా సభలు ,సమావేశాలు ఏర్పాటు చేయాలని నిశ్చయించారు.రాజకీయాలకి అతీతంగా పోరాటపంధా ఉండాలని ..అవసరమైతే బహిరంగంగానే ముద్రగడ వైఖరిని తూర్పారబట్టడానికి ఈ నేతలు సిద్ధమైపోయారు.ఓ వైపు చంద్రబాబుని నిత్యం టార్గెట్ చేస్తూ ఉద్యమం పేరిట తుని విధ్వంసం కేసు విచారణకి అడ్డుపడుతున్న ముద్రగడ కి ఈ విషయం తెలిసి షాక్ అయ్యారట.పోటీ ఉద్యమం వద్దని అయన రాయబారం పంపినా సదరు నేతలు నిర్మొహమాటంగా నో చెప్పి ముందుకెళ్తున్నారు.

SHARE