దమ్ముంటే కడుపు మాడ్చుకుందాం రండి..

0
601

 mudragada wrote letter chandrababu,lokesh dheeksha purpose
కాపు ఉద్యమనేత ముద్రగడ బాబు,చినబాబు లకు భలే సవాల్ విసిరాడు.ప్రత్యేక హోదా కోసం కలిసి దీక్ష చేద్దాం రమ్మని తండ్రీకొడుకులకు ఛాలెంజ్ చేశాడు.ఆ దీక్ష కూడా చోటిస్తే మీ ఇంట్లోనే చేస్తానని కూడా ముద్రగడ తాజా ఆఫర్ ..

ఇదంతా ఎందుకో అనుకుంటున్నారా …గతంలో సొంత ఇంటిలో ముద్రగడ చేసినదీక్షపై అనుచరులతో బాబు విమర్శలు చేయించినందుకట..ఆ విషయాన్ని ప్రస్తావిస్తూనే ముద్రగడ తాజాగా 3 పేజీల లేక ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాశారు .బాబు,చినబాబులతో ఆమరణదీక్ష పోటీకి సై అన్నారు.ఎవరెన్ని రోజులు దీక్ష చేయగలరో తేలుతుందన్నారు.తన వెనుక జగన్ ,సోనియా ,మోడీ వున్నారని ఎదురు దాడి తగదని చెప్పారు .

కాపురిజర్వేషన్ సున్నిత వ్యవహారమని బాబు అనడంపై ముద్రగడ మండిపడ్డారు .మీరు హామీ ఇచ్చారు కాబట్టే మేము పట్టుబడుతున్నామని ఆయన స్పష్టం చేశారు.కిర్లంపూడి లో తాను దీక్ష చేపట్టినప్పుడు కమిషన్ నివేదిక కోసం ప్రభుత్వం ఇచ్చిన 7 నెలల గడువు సెప్టెంబర్ 7 తో పూర్తి అవుతుందని అయన గుర్తు చేశారు.కానీ ఇప్పటిదాకా ఆ పని మొదలైందా అని అయన ప్రశ్నించారు .

ఇంతవరకు కొత్త అస్త్రాలు ప్రయోగించిన ముద్రగడ ఓ పాత విషయాన్ని తవ్వితీశారు .అదేమిటంటే …

వ్యవసాయం దండగని మీరు అన్నట్టుగానే మీపాలనలో ఆమరణదీక్షలతో ప్రయోజనం లేదని ముద్రగడ …బాబుపైకి పాతబాణం వదిలారు.అంతా బాగానే వుంది కానీ నిరాహార దీక్షతో ప్రయోజనం లేదని చెప్పిన మనిషే మళ్లీ అదే పోటీకి సవాల్ విసిరారు .ప్రయోజనం లేని పనులెవరైనా చేస్తారా ? ముఖ్యంగా రాజకీయ నేతలు…

Leave a Reply