రతన్ టాటా కన్నా ముకేశ్ అంబానీ రిచ్..ఎందుకు?

  mukesh ambani rich man than ratan tata
టాటా…అంబానీ ఈ రెండు ఆర్ధిక సామ్రాజ్యాలు దేశ పరిపుష్టికి చేస్తున్న కృషి అంతాఇంతా కాదు.అయినా ఇద్దరి ఆలోచనల్లో,వ్యవహార శైలిలో ఎంతో తేడా..ఇదిఅది అని లేకుండా అన్ని రంగాల్లో ముకేశ్ అంబానీ దూసుకెళ్తున్నారు.టాటాలు మాత్రం ఆచితూచి అడుగులేస్తారు.ఇక ఇద్దరి సంపాదన,ఆస్తుల విషయానికి వస్తే ముకేశ్ ముందుంటారు.ఎందుకిలా?

ఇదే సందేహాన్ని ఒక జర్నలిస్ట్ రతన్ టాటా దగ్గర లేవనెత్తారు.దానికి అయన ఇచ్చిన సమాధానం ఇదే…టాటాలు పారిశ్రామిక వేత్తలు …వాళ్ళు వ్యాపారవేత్తలు ..కనీసం అంబానీ అనే పేరు కూడా ఎత్తకుండానే రతన్ టాటా ఒక్క వాక్యంలో చెప్పిన సమాధానం. అయన దేశం గురించి మరో మంచిమాట కూడా చెప్పారు .భారత్ ని అజేయ ఆర్ధికశక్తిగా చూడడం కన్నా సంతోషకరమైన దేశంగా చూడడమే నాకిష్టం అని రతన్ వివరించారు.

ఈ క్రమంలో టాటా,అంబానీ ల మధ్య తేడాని తెలిపే ఎన్నో విషయాలు వెలుగుచూశాయి. టాటాలు తమకి వచ్చే లాభాల్లో నేరుగా 66 శాతం దానధర్మాలకు వినియోగిస్తారు.టాటా కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో నడిచే ట్రస్ట్ కి 66 శాతం లాభాలు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.ఆ ట్రస్ట్ ద్వారా నిరంతరం దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తారు.అవి కూడా దేశ ప్రయోజనాలకు ఉపయోగపడేలా జాగ్రత్తపడతారు.

ఇక రిలయెన్స్ అధినేత తన లాభాల్లో కేవలం 0.2 శాతం చారిటీ కోసం వినియోగిస్తారు.ఆ మొత్తం 325 కోట్లు మాత్రమే .ఇద్దరి మధ్య తేడా చూసారుగా ! ఇక మీరే నిర్ణయించుకోండి దేశానికి ఎవరి వల్ల ఎంత మేలు జరుగుతుందో ..

SHARE