Posted [relativedate]
యూపీ రాజకీయ రామాయణం మరో మలుపు తిరిగింది.కత్తులు నూరుకున్న బాబాయ్ అబ్బాయి మధ్య తాత్కాలిక సంధి కుదర్చడంలో నేతాజీ ములాయం సక్సెస్ అయ్యారు.పార్టీ సమావేశంలో సీఎం అఖిలేష్,శివపాల్ మధ్య అరుపులు,కేకలు,విసుర్లు కనిపించాయి.ఇక సంధి పొసగదని అంతా భావించారు.కానీ రాత్రికి ఆ ఇద్దర్నీ ఓ చోట కూర్చోబెట్టి ములాయం హితబోధ చేశారు.ఇద్దర్నీ మందలించి ఎవరిపని వాళ్ళు చేసుకునేలా ఓ ఒప్పందానికి రాగలిగారు.కొత్త ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రిగా అఖిలేష్ ప్రభుత్వ భాధ్యతలకే పరిమితం.యూపీ లో పార్టీ బాధ్యత చూస్తున్న శివపాల్ అదే వ్యవహారానికి పరిమితం అవుతారు. ఇద్దరు వేటు వేసిన వాళ్లకి మళ్లీ బాధ్యతలు అప్పగిస్తారు.దానిప్రకారం శివపాల్ మళ్లీ క్యాబినెట్ లోకి వస్తారు.ఇక ఇద్దరి వివాదానికి కారణమైన ఎన్నికల భాధ్యతను స్వయంగా ములాయం చూసుకుంటారు.అంటే సీట్లు ఎవరికివ్వాలని నిర్ణయించేది ఆయనే.కాకుంటే అఖిలేష్,శివపాల్ తమ అనుచరుల కోసం డిమాండ్,విన్నపం మాత్రం చేయగలరు.