మహాకూటమికి సర్జికల్‌స్టైక్‌…

Posted November 11, 2016
modi surgical strike on uttar pradesh party leaders then grand alliance break on thatసైనిక బృందం చేపట్టిన సర్జికల్‌ స్ట్రైక్‌తో పాక్‌కి దిమ్మతిరికితే.. తాజాగా మోదీ చేసిన కరెన్సీ సర్జికల్‌స్ట్రైక్‌తో విపక్షాలకు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి.. కొద్ది రోజుల్లో యూపీలో జరగబోయే ఎన్నికల కోసం అధికార ఎస్పీతో సహా అన్ని పార్టీలు ముందస్తుగా భారీ ‘సన్నహాలు’ చేసుకున్నాయి..ప్రచారానికి ఎంత.. మద్యానికెంత.. సొమ్ములు పంచడానికెంత అనేలా లోపాయకారికంగా లెక్కలు వేసుకుని సిద్ధంగా ఉన్నాయి.. కాని మోదీ కొట్టిన ఆర్థిక దెబ్బతో వారంతా విలవిలాడుతున్నారు.. కనీసం అభ్యర్థులు సిద్ధం చేసుకున్న సొమ్ములు కూడా వాడలేని పరిస్థితి.. దాంతో సమాజ్‌వాది పార్టీ కేంద్రంగా ఏర్పాటు చేయాలనుకున్న మహాకూటమికి బ్రేకులు పడ్డాయి..
               సాధారణంగా కూటమి ఏర్పడేటప్పుడు ఎవరు ఏ స్థాయిలో ఖర్చు చేయాలో ముందుగా ఒక ఒప్పందానికి వస్తారు.. ఇప్పుడు అనూహ్యపరిణామాలతో ఎస్పీ, కాంగ్రెస్‌, జేడీయూ, ఆర్‌ఎల్డీ జట్టుకట్టేందుకు కొన్ని రోజులుగా మంతనాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌తో కలిసి ఈ చర్చలు దఫదఫాలుగా సాగించారు. ఇప్పుడు నోట్ల రద్దు వల్ల మొత్తం వ్యూహమే మారిపోవడంతో ఏకాభిప్రాయం కుదిరడం లేదంటా.. దాంతో చేసేది లేక విడివిడిగా బరిలో దిగాలని చూస్తున్నారు.. ఈ విషయంపైనే ములాయలం నోరు విప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఎస్పీ అధినేత మీడియా సమావేశంలో తేల్చేశారు. దాంతో మహాకూటమి బ్రేకులు పడిందని తేలిపోయింది. ఇప్పుడు ఎన్నికలకు సొమ్ములు ఎలా సంపాదించాలనేదే ఇప్పుడు వారిముందున్న ప్రధాన సమస్య… దీనిపై అన్ని పార్టీలు త్రీవంగా కసరత్తు చేస్తున్నాయి.. మోదీ దెబ్బనుంచి ఇప్పట్లో కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు మరి..
SHARE