నాడు క‌న్నీరు నేడు ప‌న్నీరు!!

0
368

Posted [relativedate]

mulayam singh yadav praise to adityanath yogi in the ceremony of up cm oathయూపీ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ కంట క‌న్నీరు వ‌చ్చింది. అది కూడా ఆయ‌న వెక్కి వెక్కి ఏడ్చారు. ఎక్క‌డ్నుంచి వీడియో వ‌చ్చిందో.. కానీ ఇప్పుడ‌ది వైర‌ల్ అయ్యింది. సోష‌ల్ మీడియాలో యోగి ఆదిత్య‌నాథ్ క‌న్నీరుపెట్టిన వీడియో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

ఈ వీడియో 10 ఏళ్ల కింద‌టిద‌ని తెలుస్తోంది. అప్ప‌ట్లో ఓ కేసు విష‌యంలో ములాయం స‌ర్కార్.. ఆయ‌న‌ను 11 రోజుల పాటు జైల్లో పెట్టింది. త‌ర్వాత బ‌య‌టకు వ‌చ్చిన ఆయ‌న పార్ల‌మెంటులో ఆ సంఘ‌ట‌నను త‌లచుకొని వెక్కి వెక్కి ఏడ్చారు. త‌న‌పై ములాయం కక్ష గ‌ట్టార‌ని క‌న్నీరు మున్నీర‌య్యారు. కానీ కాల‌చ‌క్రం గిర్రున తిరిగింది. ఇప్పుడు యోగి ఆదిత్య‌నాథ్ ముఖ్య‌మంత్రి అయిపోయారు.

నాడు బ‌ల‌మైన రాజ‌కీయ శ‌క్తిగా ఉన్న ములాయం ఇప్పుడు పూర్తిగా బ‌ల‌హీన‌ప‌డిపోయారు. ఆదిత్య‌నాథ్ ప్ర‌మాణ స్వీకారానికి హాజ‌రైన ఆయ‌న యోగి ఆదిత్య‌నాథ్ ను అభినందించారు. ప‌దేళ్ల నాడు అరెస్ట్ చేయించిన .. ఆయ‌నే ఇప్పుడు యోగి ఆదిత్య‌నాథ్ పై ప‌న్నీరు జ‌ల్లిన‌ట్ట‌య్యింది. ఇలా నాడు క‌న్నీరు పెట్టించిన వ్య‌క్తే.. ఇప్పుడు యోగిపై ప‌న్నీరు జ‌ల్లారు. ఎంతైనా రాజ‌కీయమే అలాంటిది. ఇక్క‌డ ఎవ‌రు ఎప్పుడు అంద‌ల‌మెక్కుతారో.. ఎవ‌రు ఎప్పుడు ప‌త‌న‌మవుతారో అర్థం కాదు!!!!

Leave a Reply