ములాయం రామాయణం …రెండో పెళ్లి కధ

 Posted October 21, 2016

mulayam singh yadav second marriage story
యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ కి వ్యతిరేకంగా తండ్రి ములాయం రెండో భార్య అని వార్తలు బయటికి వచ్చాయి.అసలామె ఎవరు? పెళ్లి ఎలా జరిగింది?అనే వివరాల్లోకి వెళ్తే ..ములాయం రెండో భార్య పేరు సాధనా గుప్తా యాదవ్ .ఒకప్పుడు సమాజ్ వాదీ లో చోటా నాయకురాలు.2003 లో ములాయం మొదటి భార్య కన్ను మూసారు.అయితే అంతకు ముందే ములాయం కి సాధన దగ్గరైంది.ఆమెని పెళ్లి కూడా చేసుకున్న విషయం సమాజ్ వాదీ నాయకులకు తెలుసు.ఈ విషయంలో వస్తున్న విమర్శల్ని దృష్టిలో ఉంచుకుని 2007 లో రెండో పెళ్లిని ధృవీకరించారు ములాయం.

ములాయం,సాధనలకి ఓ సంతానం కూడా .1988 లో పుట్టిన ప్రతీక్ యాదవ్ ఇప్పుడు ఆ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.అతన్ని రాజకీయ రంగప్రవేశం కోసమే ములాయం మీద సాధన ఒత్తిడి చేస్తోందని అఖిలేష్ వర్గీయుల ఆరోపణ.అసలామె ములాయం కి చేతబడి చేయించిందని కూడా అఖిలేష్ మద్దతుదారు అయిన ఎమ్మెల్సీ ఉదయ్ వీర్ డౌట్ .అయన ఈ విషయం మీద రాసిన లేఖ బయటికి రావడంతో యూపీ రాజకీయాలు ..ముఖ్యంగా సమాజ్ వాదీ పరిణామాలు ఇంకా వేడెక్కాయి.ఇదంతా చూస్తుంటే యూపీ లోనే జరిగిందని చెప్పుకునే రామాయణం గుర్తుకి వస్తోంది ..భరతుని కోసం రాముణ్ణి అడవికి పంపించమన్న కైకేయి ..వేదన పడ్డ దశరధుడు ఆనాటి రామాయణం ..సాధన మాట విన్న ములాయం ఆధునిక రామాయణం ..చూద్దాం ఈ కధ ఎన్ని మలుపులు తిరుగుతుందో ..

SHARE