ఎమాన్ అహ్మద్ కు ఏమైంది..?

0
396
mumbai doctor says eman ahmed weight decreased but her sister doctors said lie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

mumbai doctor says eman ahmed weight decreased but her sister doctors said lieఎమన్ అహ్మద్ విషయంలో డాక్టర్లు అబద్ధం చెప్పారని ఆమె సోదరి షైమా సలీం ఆరోపించింది. ప్రపంచంలోనే అత్యధిక బరువుగల మహిళగా గుర్తింపుపొందిన ఎమన్ బరువు సగానికి సగం తగ్గిందనీ, వీల్‌చైర్‌లో కూర్చోగలుగుతోందంటూ డాక్టర్లు వెల్లడించిన నేపథ్యంలోనే… షైమా అనూహ్యంగా చేసిన ఆరోపణలు విస్మయానికి గురిచేస్తున్నాయి. తన సోదరికి సరైన చికిత్స అందడం లేదనీ ఎమన్ ప్రస్తుతం తీవ్ర అస్వస్థతతో ఉందని షైమా ఆరోపించింది. ఎమన్‌ను చికిత్స కోసం ముంబైకి తీసుకొచ్చిన డాక్టర్ ముఫజల్ లక్నావాలా ఓ అబద్ధాలకోరని పేర్కొంది.

ఈ నెల 14న ఆస్పత్రి గదిలనేలోనే షైమా స్వయంగా ఈ వీడియో తీసినట్టు తెలుస్తోంది. తన చెల్లెలు బరువు తగ్గిపోయిందంటూ డాక్టర్ లక్నావాలా అబద్ధాలు చెబుతున్నారని షైమా సదరు వీడియోలో ఆరోపించింది. ప్రస్తుతం ఆమె కనీసం మాట్లాడలేకపోతోంది. ఏమాత్రం కదల్లేకపోతోంది. చర్మం మొత్తం బ్లూ రంగులోకి మారిపోతోంది. కనీసం కొంచెం కూడా కోలుకున్నట్టు కనిపించడం లేదని షైమా పేర్కొంది. హాస్పటల్‌ కనీసం సీఏటీ స్కాన్ మెషీన్ కూడా లేదనీ… ఎమన్‌ను టాయ్‌లెట్‌కు తీసుకెళ్లేందుకు ఎస్కార్టును ఇస్తానన్న యాజమాన్యం అసలు ఆ ఊసే ఎత్తడం లేదని తెలిపింది.

షైమా ఆరోపణలపై డాక్టర్ లక్డావాలా మాట్లాడుతూ… మరో రెండు రోజుల్లో ఎమన్‌ను డిశ్చార్జ్ చేయనున్నామనీ.. ఈలోపే ఉన్నట్టుండి షైమా తమపై ఎందుకు ఆరోపణలు చేస్తుందో తెలియడం లేదన్నారు. ఆమె అలా ఎందుకు మాట్లాడుతుందో ఆమెకు మాత్రమే తెలుసుననీ… అయితే సదరు ఆరోపణల వల్ల తాము తీవ్ర నిరాశకు గురైనట్టు పేర్కొన్నారు. అయితే అధికారుల వాదన మాత్రం మరోలా ఉంది. ఎమన్‌కు కేవలం ఫిజియోథెరపీ మాత్రమే అవసరమైనందున త్వరలోనే డిశ్చార్జ్ చేయనున్నారనీ… అయితే ఆమెను ఇప్పట్లో ఇంటికి తీసుకెళ్లడం సదరు కుటుంబానికి ఇష్టం లేదని చెబుతున్నారు. ఈజిప్టులో ఉచితంగా వైద్యం అందించే అవకాశం లేకపోవడతో మరికొన్ని రోజుల పాటు ఇక్కడే ఉంచేందుకు ఎమన్ కుటుంబం లేనిపోని ఆరోపణలు చేస్తుందని అధికారులు చెబుతున్నారు.

Leave a Reply