రైతు గుట్టు విప్పిన ముంబై మిర్రర్ …

0
291
mumbai mirror about raithu movie

Posted [relativedate]

mumbai mirror about raithu movie
రైతు సినిమా పట్టాలు ఎక్కుతుందని కొందరు..ఆ అవకాశాలు లేవని మరికొందరు అనుకుంటున్నారు.అయితే ఈ రెండు రకాల వాళ్ళు చెబుతున్న కారణం ఒకటే ..అదే ..అమితాబ్ డేట్స్.బాలయ్య,కృష్ణ వంశీ కలిసి అమితాబ్ ని సంప్రదించినపుడే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే అమితాబ్ నో అన్నట్టు ..అందుకే రైతు ఆగిపోయినట్టు వార్తలు వచ్చాయి.ఇంతలో ముంబై మిర్రర్ అనే పత్రిక అమితాబ్ ఫ్యూచర్ ప్లాన్స్ వివరిస్తూ రైతు గురించి ఓ కధనం ఇచ్చింది.
ముంబై మిర్రర్ కధనం ప్రకారం అమితాబ్ కి ఎన్నో ఆఫర్స్ వస్తున్నా ఆయన డేట్స్ సమస్య ఆచితూచి చిత్రాలు ఎంపిక చేసుకుంటున్నారు.ఆయన ఓ తెలుగు సినిమా చేయబోతున్నారని ముంబై మిర్రర్ వెల్లడించింది.ఈ సినిమా షూటింగ్ 2017 ,జూన్ నుంచి మొదలవుతుందని ఆ పత్రిక తెలిపింది.అంటే రైతు సినిమా పట్టాలెక్కడం,అందులో అమితాబ్ చేయడంఖాయమే ..కాకుంటే సినిమా షూటింగ్ ఒక్కటే కాస్త ఆలస్యమవుతుంది.ముందుగా సినిమా షూటింగ్ మొదలెట్టి ..ఆపై జూన్ లో అమితాబ్ పాత్ర వుండే పార్ట్ చిత్రీకరించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.శాతకర్ణి వేడి చల్లారగానే రైతు సినిమా ప్రకటన రావొచ్చని తెలుస్తోంది.

Leave a Reply