రకుల్ ప్రీతిసింగ్ కు షాక్ ఇచ్చిన మురుగదాస్

Murugadoss Shocking Comments On Rakul Preet Singh

0
668

Posted [relativedate]Murugadoss Shocking Comments On Rakul Preet Singhఫుల్ ఫాంలో ఉన్న యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు డైరెక్టర్ మురుగ దాస్ షాక్ ఇచ్చాడు . చిన్న సినిమాలతో కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది ఈ బ్యూటి. ప్రస్తుతం రాంచరణ్ హీరోగా తెరకెక్కుతున్న ధృవ సినిమాతో పాటు మురుగదాస్ మహేష్ బాబుల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలోనూ హీరోయిన్గా నటిస్తోంది.

మహేష్ సినిమా షూటింగ్ సందర్భంగా మురుగదాస్ చెప్పిన విషయం రకుల్ ను షాక్ కు గురిచేసిందట మురుగదాస్ గతంలోనే ఓ సినిమాకు రకుల్ హీరోయిన్గా తీసుకోవాలని భావించాడట. కానీ రకుల్ చేసిన ఓ టివి కమర్షియల్ చూసి తుపాకీ సినిమాకు హీరోయిన్గా తీసుకోవాలని భావించాడు. అయితే రకుల్ కాంటాక్ట్ కోసం ఆ యాడ్ ఏజెన్సీని సంప్రదించగా, ఆమెకు సినిమాల్లో చేసే ఇంట్రస్ట్ లేదని చెప్పారట ఆ ఏజెన్సీ వాళ్ళు. దీంతో తన ఆలోచనను విరమించుకొని కాజల్ను హీరోయిన్గా తీసుకున్నాడట మురుగదాస్. ఈ విషయం తెలిసిన రకుల్ ఇప్పుడు తెగ బాధపడి పోతోంది .

Leave a Reply