జగన్ సారీ చెప్పక తప్పదా?

Posted [relativedate]

muslim minority committees demand jagan will sorry to collector ahmed babu
కాలం కలిసి రానప్పుడు తాడే పామై కరుస్తుందంటే ఏమో అనుకున్నాం..కానీ వైసీపీ అధినేత జగన్ కి ఎదురవుతున్న ఇబ్బందులు చూస్తే అందులో నిజం ఉందనిపిస్తోంది.బస్సు ప్రమాద ఘటనపై జగన్ స్పందించిన తీరు ఆయన మెడకే చుట్టుకుంటోంది.కలెక్టర్ ని జైలుకు పంపుతానంటూ జగన్ చేసిన వ్యాఖ్యలతో ఐఏఎస్ లు ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడారు.అయితే ఉన్నత స్థాయి అధికారులు కావడంతో ఈ వ్యవహారంలో మరీ దూకుడుగా మాట్లాడలేదు.అయితే అంతకు మించిన సీన్ ఇప్పుడే మొదలైంది.కృష్ణా జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబు ని జగన్ దూషించినందుకు మైనారిటీలు రంగంలోకి దిగారు.మైనారిటీ వ్యక్తి అయినందునే కలెక్టర్ మీద జగన్ ఆ స్థాయిలో రెచ్చిపోయాడని వారు ఆరోపిస్తున్నారు.పైగా సౌమ్యుడనే పేరున్న అహ్మద్ బాబు కి క్షమాపణ చెప్పాలని మైనారిటీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

రాష్ట్రంలో వున్న ఏకైక ముస్లిం ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబు అన్న విషయం ప్రచారంలోకి రావడంతో వైసీపీ సానుభూతిపరులైన ముస్లిం నేతల్లోనూ జగన్ వైఖరిపై అసహనం వ్యక్తం అవుతోంది.గుంటూరు లో జగన్ క్షమాపణ డిమాండ్ తో చేసిన ర్యాలీలో వైసీపీ శ్రేణులు కూడా పాల్గొన్నట్టు ఆ పార్టీ అధిష్టానానికి ఇప్పటికే చేరిపోయింది.ఐఏఎస్ లతో పాటు మైనారిటీ నేతలు కూడా రంగంలోకి దిగడంతో జగన్ పరిస్థితి మద్దెల దరువు అయిపోయింది.ఐఏఎస్ ల విషయం ఎలా ఉన్నా మైనారిటీ లని నిర్లక్ష్యం చేస్తే పార్టీకి అండగా ఉంటున్న కీలక వర్గం దూరమయ్యే ప్రమాదం ఉందని సీనియర్ నేతలు జగన్ చెవిన వేశారట.ఒక్క క్షమాపణతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడితే మంచిదని వారు సూచించారట.అయితే తెలుగు భాషలో జగన్ కి నచ్చని ఒకే ఒక్క పదం “క్షమాపణ “అని ఆయన గురించి తెలిసిన వారంటారు.అయితే ఓటు ముందు ఓటరు ఏ నాయకుడైనా బానిసే…ఈ పరమార్ధాన్ని గుర్తించి జగన్ సారీ చెపుతాడో లేక ఎదురెళ్లి మైనారిటీలని దూరం చేసుకుంటాడో చూడాలి.

Leave a Reply