చంద్రబాబు చంపేస్తారేమో …ఎవరిదీ భయం?

  muttayya told chandrababu will be do killed me cash for vote case ఓటుకునోటు కేసులో కీలక నిందితుడు మత్తయ్య స్వరం మారింది.నిన్నమొన్నటిదాకా కేసీఆర్ సర్కార్ వేధిస్తుందంటూ విజయవాడలో ప్రెస్ మీట్లు పెట్టిన అయన ఈసారి ఢిల్లీ నుంచి మాట్లాడారు. స్థలంతో పాటు ఆరోపణల తీరు కూడా రివర్స్ అయ్యింది.చంద్రబాబు వల్ల తనకు,తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆయన అన్నారు.తనను అవసరానికి వాడుకున్న బాబు ఇప్పుడు నట్టేట ముంచాడని ధ్వజమెత్తారు.

తనకి ఏమి జరిగిన దానికి బాబే బాధ్యుడని తేల్చేశాడు.చంద్రబాబుని టార్గెట్ చేసి మాట్లాడిన మత్తయ్య చివరిలో కేసీఆర్ ని కూడా కలిపారు.ఆ ఇద్దరూ తన జీవితం తో ఆటలాడుకుంటున్నారని అయన ఆరోపించారు.కేసుకి సంబంధించి బాబు తనను పట్టించుకోవడం లేదన్న కోపం తోనే మత్తయ్య ఈ ఆరోపణలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

SHARE