మైత్రి మేకర్స్ ప్లాన్ అదేనా..!

Posted December 15, 2016

Mytri Makers Plan For Ram Charanమైత్రి మూవీ మేకర్స్ సూపర్ స్టార్ మహేష్ తో శ్రీమంతుడు సినిమా నిర్మించిన నిర్మాతలు. ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూషన్ చేసి డైరెక్ట్ గా నిర్మాణంలోకి దిగిన ఈ ముగ్గురు నిర్మాతలు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారట. రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రాం చరణ్ అమెరికా పర్యటనలో అన్ని విషయాలు దగ్గరుండి చూసుకున్నది కూడా వీరేనట. అక్కడ ప్రమోషన్స్ అన్ని అనుకున్నది అనుకున్నటుగా ప్లాన్ చేయడంతో మొదటి వారంలోనే మిలియన్ మార్క్ దాటేసింది.

అయితే మైత్రి నిర్మాతలు చూపించిన అభిమానానికి చేసిన ఏర్పాట్లకు చరణ్ ఫిదా అయ్యాడట. ఇక తెలుస్తున్న సమచారం ప్రకారం సుకుమార్ తో తీసే సినిమా వారి నిర్మాణంలోనే అంటున్నారు. ఇదంతా మైత్రి ముందు చూపుతో చేసిన ప్లాన్ అని తెలుస్తుంది. ఏది ఏమైనా అమెరికా ప్రమోషన్స్ పుణ్యమాని మిలియన్ మార్క్ క్రాస్ చేసిన చెర్రి ఇక అదే నిర్మాణ సంస్థతో సినిమా తీస్తే తిరుగు లేదని చెప్పేయొచ్చు.

చెర్రికి ఓవర్సీస్ మార్కెట్ పెంచడంలో కీలకంగా మారిన మైత్రి మేకర్స్ తీయబోయే చరణ్, సుక్కు సినిమాను ఓవర్సీస్ లో భారీ మొత్తంగా డిస్ట్రిబ్యూట్ గాని అమ్మడానికి వీలుండేలా ధ్రువ సినిమాకు ప్లాన్ సెట్ చేశారు. సో కార్పోరేట్ కల్చర్ సినిమాలపై చూపించి లాజికల్ గా ముందుకెళ్తున్న మైత్రి మేకర్స్ వారికి తీస్తున్న ప్రతి సినిమా హిట్ అవ్వాలని ఆశిద్దాం.

SHARE