ఎన్ టీవీ మళ్లీ కాలుదువ్వుతోందా?

0
255
N tv wrote aganist story about on nara lokesh

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

N tv wrote aganist story about on nara lokesh
N టీవీ తాజాగా ప్రసారం చేసిన ఓ కధనం ఇప్పుడు మీడియా తో పాటు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్.యువనేత,మంత్రి లోకేష్ ఏపీ లో పార్టీని అధికారం లోకి తీసుకురావడానికి కష్టపడ్డ వారిని వాడుకుని వదిలేశారని ఆ కధనంలో సూటిగా కామెంట్ చేశారు.ఛానెల్స్,న్యూస్ పేపర్స్,సోషల్ మీడియాలో ఇలాంటివి ..ఇంతకుమించిన కధనాలు కోకొల్లలు.అందులో వింతేమీ లేదు.కానీ ఇప్పుడు n టీవీ గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే..గతంలో ఇంతకు మించి టీడీపీ సర్కార్ మీద n టీవీ దాడి చేసింది.సర్కార్ కూడా కేబుల్ ఆపరేటర్ల మీద ఒత్తిడి తెచ్చి ప్రసారాలు ఆపి కౌంటర్ ఎటాక్ చేయడంతో ఎన్ టీవీ యాజమాన్యం వెనక్కి తగ్గింది. చంద్రబాబు అంటే ఒంటికాలు మీద లేచే కొమ్మినేనిని తొలగించడంతో పాటు సర్కార్ ని టార్గెట్ చేయడమే లక్ష్యంగా సాగే కధనాలు ఆపింది.ఇదంతా గతం.అందరికీ తెలిసిన విషయం.అయితే ఇప్పుడు జరిగిన దాని వెనుక లోగుట్టు మాత్రం ఎవరికీ తెలియడం లేదు.

మీడియా నిర్వహణ ఓ వ్యాపారం గానే సాగుతున్న ఈ రోజుల్లో ఇంకో రెండేళ్ల దాకా ఎన్నికలు లేవని తెలిసి,గతంలో చేదు అనుభవం రుచి చూసి కూడా n టీవీ ఇలా రెచ్చిపోతుందంటే అందులో ఏదో లోగుట్టు లేకుండా ఉంటుందా? లోకేష్ మీద వేసిన స్టోరీ మాత్రం ఏదో కాకతాళీయంగా జరిగినట్టు లేదు.కిందటి ఎన్నికల టైం,ఆ తర్వాత కూడా n టీవీ జగన్ అనుకూలంగా కధనాలు ఇచ్చింది.మరీ ముఖ్యంగా సర్వేల పేరుతో చంద్రబాబుని పదేపదే దెబ్బకొట్టే ప్రయత్నం చేసింది.2014 లో చివరకు ఎన్నికల ఫలితాలు మొదలైన ఓ గంట దాకా కూడా జగన్ అనుకూల వాతావరణం వున్నట్టే నటించింది.ఇప్పుడు మళ్లీ ముసుగు తీసి అదే రూట్ లోకి వెళ్తోంది అనడానికి లోకేష్ మీద కధనం ఓ శాంపిల్ గా వదిలారా? ఇదే నిజమైతే బాబు సర్కార్ కూడా ఇంకో రెండేళ్లు నోరెత్తకుండా, కౌంటర్ ఎటాక్ చేయకుండా వదిలేస్తుందా? ఏదేమైనా n టీవీ మళ్లీ కాలు దువ్వుతున్నట్టుంది.ఈసారి బాబు ఆ టీవీ ని ఎలా హేండిల్ చేస్తారో ..ఏమిటో?

Leave a Reply