సచిన్ తో తెలుగు స్టార్ల బంతాట….

0
818

  nag chiru team participate sachin isl

అవును … మీరు చదివింది నిజమే.. నాగ్-చిరు అండ్ కో  కలిసి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో ఫుట్ బాల్ టీం ను కొన్నారు..

IPL మాదిరిగా ISL (ఇండియన్ సూపర్ లీగ్) ను స్టార్ట్ చేసారు అని అందరికి తెలుసు,ఒకప్పుడు ఈ ISL లీగ్  లో  ‘కేరళ బ్లాస్టర్స్  ఫుట్ బాల్ క్లబ్’ టీం ను PVP సంస్థ కొనుక్కుంది కాని ఆ సంస్థ లీగల్ కేసుల్లో ఇరుక్కోవటం వలన ఈ లీగ్ నుంచి తప్పుకున్నారు, అప్పట్నుంచి ఈ టీంను ఎవరు కొనుక్కోలేదు ఇది తెలుసుకున్న నాగ్-చిరు గ్యాంగ్ సచిన్ తో కలిసి ఈ టీం ను కొనుగోలుచేసారు, ఈ విషయాన్ని నాగ్ స్వయం గా ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు..

తిరుమలలో సచిన్, సచిన్ భార్య ‘అంజలి’, నాగ్,చిరు, అరవింద్,నిమ్మగడ్డ ప్రసాద్ లు ధైవ ధర్శనం లో పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు చేయించుకున్నారు తదినంతరం అందరుకలిసి మీడియాలో తమ జట్టు గురించి వివరించారు.

ఒకప్పుడు నాగ్ మీద నమ్మకంతో చిరు, అరవింద్ లు  మొదటిసారిగా వ్యాపార రంగంలోకి  దిగి  మా టీవీ లో షేర్స్ కొని, స్టార్ కి అమ్మడం ద్వార మంచి లాభాలు పొందారు.

ఇప్పుడు  కూడా అదే నమ్మకంతో సచిన్ తో కలిసి ఫుట్ బాల్ టీం ను కొన్నారు. ఏది ఏమైనా వ్యాపార రంగంలో  తెలుగు హీరోలలో  అందరికన్నా నాగ్ చాలా తెలివిగలవాడు, తను లాభం పొందటమే కాకుండా తన తోటి స్నేహితులకు కూడా వ్యాపార రంగాన్ని అలవాటు చేస్తూ మంచి లాభాల్ని తెచ్చిపెడుతున్నాడు, ఈ రంగంలో కూడా మనోళ్ళు సక్సెస్ కావాలి అని కోరుకుందాం… ఆల్ ది బెస్ట్…

Leave a Reply