మరోసారి చైతూ కోసం నాగ్‌ గెస్ట్‌గా..!

0
560
nag guest role in chaitu film

Posted [relativedate]

nag guest role in chaitu film
అక్కినేని నాగార్జున మంచి బిజినెస్‌మెన్‌ అనే విషయయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తను నిర్మించే సినిమాలను ఎలా ప్రమోట్‌ చేయాలో ఆయనకు బాగా తెలుసు. తన బ్యానర్‌లో రూపొందే సినిమాలకు మంచి బిజినెస్‌ చేయడంలో ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ప్రస్తుతం నాగార్జున తన తనయుడు నాగచైతన్యతో ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ అనే చిత్రాన్ని కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాను వచ్చే నెల విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆ సినిమాకు భారీ పబ్లిసిటీ కల్పించేందుకు, ఆ సినిమాను ఎక్కువ రేటుకు అమ్మేందుకు నాగార్జున మాస్టర్‌ మైండ్‌ ఉపయోగించాడు. ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ చిత్రంలో చిన్న గెస్ట్‌ రోల్‌ను పోషించాడు. ఆ గెస్ట్‌ రోల్‌తో చిత్రానికి భారీ క్రేజ్‌ను తీసుకు రావడం ఖాయంగా కనిపిస్తుంది. ‘ప్రేమమ్‌’ చిత్రంలో నాగార్జున చిన్న పాత్రలో కనిపించిన విషయం తెల్సిందే. ఆ పాత్రకు మంచి టాక్‌ రావడంతో సినిమాకు హెల్ప్‌ అయ్యింది. మళ్లీ ఈ చిత్రంలో కూడా నాగార్జున గెస్ట్‌ రోల్‌లో కనిపించి సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలువబోతున్నాడు. ఇప్పటి వరకు ఈ విషయాన్ని అధికారికంగా వెళ్లడి చేయలేదు. అయితే డిస్ట్రిబ్యూటర్లకు ఈ విషయాన్ని చెప్పి ఎక్కువ మొత్తంకు అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చైతూ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా తెరకెక్కిన ఈ సినిమాను వచ్చే నెల 19న విడుదల చేయబోతున్నారు.

Leave a Reply