Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నాగచైతన్య కెరీర్లో మొదటి సక్సెస్ ‘ఏమాయ చేశావే’. ఆ సినిమాకు దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ అనే విషయం తెల్సిందే. ఆ చిత్రం సక్సెస్‌తో ఇటీవలే ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రాన్ని గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య నటించిన విషయం తెల్సిందే. మొదటి సినిమా సక్సెస్ సెంటిమెంట్ కలిసి రాలేదు. వీరి కాంబోలో వచ్చిన రెండవ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ సినిమా చైతూ కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడలేదు. అయినా కూడా చైతూ మరోసారి ఆ దర్శకుడితో వర్క్ చేసేందుకు సిద్దం అయ్యాడు.
గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఎప్పుడు కూడా ద్విభాష లేదా త్రిభాష చిత్రాన్ని చేస్తూ ఉంటాడు. ఒకే సినిమాను వివిధ భాషల్లో ఈయన చేయడం వల్ల ఆలస్యం అవుతూ వస్తుంటుంది. గౌతమ్ మీనన్ తాజాగా ఒక లవ్ స్టోరీతో మళ్లీ మూడు భాషల్లో సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు. ఈసారి కూడా తెలుగులో తన ప్రేమ కథకు హీరోగా చైతూను గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం చైతూ చాలా బిజీగా ఉన్నా కూడా దర్శకుడిపై గౌరవంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా అయినా చైతూకు సక్సెస్‌ను ఇస్తుందేమో చూడాలి.