అఖిల్ పెళ్లి డేట్ కే చైతూ పెళ్లి..?

0
597
naga chaitanya and samantha marriage date

Posted [relativedate]

naga chaitanya and samantha marriage dateప్రస్తుతం తెలుగు సినీ అభిమానుల దృష్టంతా అక్కినేని ఫ్యామిలీ మీదే ఉంది. నాగార్జున చిన్న కొడుకు అఖిల్ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని వార్తలు రావడమే అందుకు కారణం. అఖిల్ పెళ్లి క్యాన్సిల్ అవ్వడేమో గానీ ఇప్పుడు చైతూకి, సమంతకి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయని సమాచారం.

నిజానికి అఖిల్… అతి చిన్న వయసులో, తన కంటే వయసులో పెద్ద అమ్మాయితో  పెళ్లికి రెడీ అయ్యి అందరికీ షాక్ ఇచ్చాడు. అందులోనూ తన అన్నయ్య చైతూ పెళ్లికాక ముందే తాను పెళ్లిపీటలు ఎక్కుదామనుకున్నాడు.  అలానే ఎంగేజ్ మెంట్ కూడా చైతూ కంటే ముందే చేసుకున్నాడు అఖిల్. కాగా అన్నయ్యకు పెళ్లి కాకుండా కనీసం నిశ్చితార్ధం కూడా కాకుండా తమ్ముడు పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో చైతూకి, సమంతకి నాగ్ హడావుడిగా నిశ్చితార్ధం జరిపించేశాడు. నిజానికి  చైతూ, సమంతలకి ఎంగేజ్మెంట్  కానీ,  పెళ్లి కానీ చేసుకొనే ఉద్దేశ్యం లేదు. కానీ అఖిల్ పెళ్లికి రెడీ అవడంతో వీరిద్దరూ బలవంతానా నిశ్చితార్ధానికి ఒప్పుకున్నారు. అయితే పెళ్లికి మాత్రం సమయం ఉందని ఖచ్చితంగా చెప్పేశారు.

కానీ తాజాగా అఖిల్ పెళ్లి రద్దు విషయంలో  నెగిటివ్ టాక్ రావడంతో చైతు పెళ్లి ఇష్యూని హోల్డ్ లో పెడితే మరిన్ని పుకార్లు వస్తాయని గ్రహించాడట నాగ్. వీటన్నింటికి చెక్ పెట్టడానికి అఖిల్ పెళ్లి  ముహుర్తానికే చైతూ, సమంతల పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నాడట. ముందు చైతూ పెళ్లి సింపుల్ గా చేద్దామని భావించాడు నాగ్. కానీ ఇప్పుడు అఖిల్ వల్ల పోయిన పరువుని చైతూ పెళ్లి గ్రాండ్ గా చేసి తిరిగి నిలబెట్టుకోవాలని ఆలోచిస్తున్నాడట. అందుకే చైతూ, సమంతలపై పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడట నాగార్జున. మరి చైతూ తండ్రి పరువుని కాపాడతాడో లేదో చూడాలి.

Leave a Reply