చైతూ, సమంత పెళ్లి కబురు

Posted May 19, 2017 at 12:15

naga chaitanya and samantha marriage on october 6
నాగ చైతన్య, సమంతల వివాహ నిశ్చితార్థం జరిగి చాలా నెలలు అవుతుంది. అయినా పెళ్లికి సంబంధించి ఇంకా ఎలాంటి అప్‌డేట్‌ వారిద్దరి నుండి రావడం లేదు. తెలుగు సినిమా ప్రముఖుల నుండి సాదారణ ప్రేక్షకుల వరకు అంతా కూడా ఎంతో ఆసక్తిగా వీరి వివాహం  గురించి ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరం చివర్లో తమ పెళ్లి ఉంటుందని గతంలో ఒకసారి నాగచైతన్య చెప్పుకొచ్చాడు. అయితే క్లారిటీగా ఎప్పుడు ఉంటుందనే విషయంను మాత్రం తేల్చి చెప్పలేదు.

తాజాగా సినీ వర్గాల నుండి, అక్కినేని ఫ్యామిలీ సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం నాగచైతన్య, సమంతల వివాహం అక్టోబర్‌ 6న అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గోవా చర్చ్‌లో వీరి వివాహం జరుగనుంది. క్రిస్టియన్‌ పద్దతిలో మొదట వివాహం అయిన తర్వాత హిందూ పద్దతిలో కూడా వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారు. ఇక సినీ పరిశ్రమ వారితో పాటు ఆత్మీయుల కోసం నాగచైతన్య, సమంత వివాహ రిసెప్షన్‌ను హైదరాబాద్‌లో భారీగా నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ సభ్యులతో పాటు సమంత కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం ఈ విషయమై చర్చలు జరుపుతున్నారు.

SHARE