చైతూ సినిమాకి మణిశర్మ సంగీతం

Posted October 13, 2016

  naga chaitanya indraganti mohan krishna movie music director manisharma

మెలోడీ బ్రహ్మ మణిశర్మ మళ్లీ ఫాంలోకి వచ్చేశాడు. ‘జెంటిల్ మన్’ చిత్రంతో తన ప్రత్యేకని మళ్లీ రుజువు చేసుకొన్నాడు. ముఖ్యంగా నేపథ్య సంగీతం
అదరగొట్టేశాడు. దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ చేయబోయే తదపరి చిత్రానికి కూడా మణిశర్మ సంగీతం సమకూర్చనున్నాడు.

‘జెంటిల్ మన్’ హిట్ కిక్కులో ఉన్న ఇంద్రగట్టి.. తన తదుపరి చిత్రాన్ని నాగ చైతన్యతో ప్లాన్ చేస్తున్నాడు. ‘వారాహి చలనచిత్రం’ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది. సంగీత నేపథ్యం ఉన్న కథాంశంతో ఓ డిఫరెంట్ కథని రెడీ చేసుకొన్నాడు ఇంద్రగట్టి. దానికి మణిశర్మ మాత్రమే న్యాయం చేయగలడని.. ఆయన చేత మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. గతంలో నాగార్జునకి ఎన్నో మ్యూజికల్ హిట్స్ ని అందించాడు మణి. ఇప్పుడు తనయుడు చైతూ సినిమాకి సంగీతం  అందించబోతున్నాడు. మరోసారి మణి తనదైన బాణీలతో అలరిస్తాడేమో చూడాలి.

SHARE